ముస్లిం కానిస్టేబుల్ మానవత్వం
తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా రెట్టియపట్టి గ్రామానికి చెందిన 24 సంవత్సరాల సులోచన గర్భవతి. నొప్పులు రావడంతో ఆమె భర్త, మరో బంధువుతో కలిసి తమ గ్రామం నుండీ 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనప్పరాయ్ లోని ఆస్పత్రికి అంబులెన్స్ లో వెళ్ళారు. సిజేరియన్ చేయించుకుంటే బెటర్ అని అక్కడి డాక్టర్లు సలహా ఇచ్చారు. కాకపోతే, సిజేరియన్ సమయంలో రక్తం ఎక్కించాల్సి ఉంటుందనీ, లాక్ డౌన్ వల్ల ఆస్పత్రిలో రక్తం అందుబాటులో లేదనీ, డోనర్ ని తీసుకుని రావాలని గానీ, లేకపోతే, ఊరికి వెళ్ళి, నాలుగురోజుల తర్వాత తిరిగి రావల్సిందిగా డాక్టర్లు సూచించారు.
ఆ ఊరిలో తమకు తెలిసిన వారు ఎవ్వరూ లేకపోవడంతో, రక్తం దొరకడం అయ్యేపని కాదని, తమ గ్రామానికి తిరిగి వెళ్ళిపోవాలనీ వారు డిసైడ్ చేసుకున్నారు. కానీ, తమను ఆ హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసిన అంబులెన్స్ అప్పటికే వెళ్ళిపోయింది. ఎలాగోలా సెంటర్ కి వెల్తే అక్కడ ఏవైనా వెహికల్స్ ఉండొచ్చని, సులోచన, ఆవిడ భర్త, మరో బంధువు , ముగ్గురూ కలిసి మెల్లగా రోడ్డుపై నడుచుకుంటూ బయల్దేరారు.
రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సయ్యద్ అబూతాహి ర్ఈ సమయంలో ఎక్కడికి వెల్తున్నారని వారిని ఆపి అడిగాడు. ఆస్పత్రి నుండీ తమ గ్రామానికి వెల్తున్నామని వారు చెప్పడంతో, వారికి ట్యాక్సీని అరేంజ్ చేశాడు. ఇంతలో అనుమానమొచ్చి, నెలలు నిండిన తర్వాత, ఆసుపత్రికి కాకుండా, ఇంటికెందుకెల్తునారని అడిగాడు. రక్తం దొరకకపోవడం వల్ల అని తెలియడంతో, కావలసిన బ్లడ్ గ్రూప్ ఏదో కనుక్కుని, వారిని తన డ్యూటీ ఐపోయే టైమ్ 2.PM వరకే అక్కడే వెయిట్ చేయమన్నాడు.
ఈ లోపలే ముగ్గురికీ లంచ్ కూడా తెప్పించాడు. డ్యూటీ ఐపోగానే, వారిని నేరుగా హాస్పిటల్ కి తీసుకెళ్ళి, తానే బ్లడ్ డొనేషన్ చేశాడు. రాత్రి పది గంటలకు బేబీ గర్ల్ పుట్టింది. పాపను చూసి, ఆ తర్వాతే ఇంటికెళ్ళాడు. తెల్లారేకల్లా , ఈ విషయం లోకల్ న్యూస్ లో రావడంతో, డిజీపీ 10000/- రూపాయలు పారితోషికం ప్రకటించాడు. కానిస్టేబుల్ ఆ పదివేలను బాలింతరాలికి గిఫ్టుగా ఇచ్చేశాడు.
-------------------------------------------------------
Sulochana is a 24-year-old pregnant woman from Rettiyapatti village in Tiruchirappalli district of Tamil Nadu. Her husband and another relative were in an ambulance for a short time. Doctors advised that a cesarean was better. Otherwise, the doctor suggested that blood be given during the cesarean period, that the blood was not available in the hospital due to the lockdown, or that the donor should be taken, otherwise, it would go away and return four days later.
In the absence of anyone they knew in the area, they decided not to find blood and to return to their village. But the ambulance that drove themselves to the hospital was already gone. There could be any vehicles, how could the sulochana, Avida's husband, another cousin, three of them walking on the road.
Constable Syed Abutahi, who is on duty on the road, asked them where they were staying. They said they were going to the village from the hospital and they arranged a taxi for them. Meanwhile, after months of suspicion, he asked if he was staying at the hospital rather than the hospital. Knowing that the blood was not available, the Blood Group found something and waited for them until 2.PM.
In this time constable arranged lunch for all three. As soon as the duty was on, she was taken straight to the hospital, where she underwent blood donation. Baby girl was born at ten o'clock at night. He saw the sin and then became intrigued. At the time of the announcement of the issue in the local news, the DGP announced a sum of Rs.10,000 / -. The constable gave the ten thousand gifts to the infantryman.
Comments
Post a Comment