ఇంత కంటే విషాధం మరొకటి ఉండదేమో !
కరోనా వైరస్ మనుషులతోపాటు మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. ఇందుకు సాక్ష్యంలా నిలిచే విషాద ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నిర్మల్ జిల్లా ఈద్ గావ్‌కి చెందిన మహారాజ్ లింగ్ రాజు(44) కామారెడ్డి రైల్వేస్టేషన్లో హమాలిగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. లాక్‌డౌన్ ఉండటం వల్ల ప్రస్తుతం గాంధీ గంజ్ ప్రాంతంలో తలదాచుకుంటూ, దాతలిచ్చే ఆహార పొట్లాలతో కడుపు నింపుకుంటున్నాడు. ఒంటరిగా జీవిస్తున్న రాజు మొన్న శనివారం రాత్రి హఠాత్తుగా చనిపోయాడు.
ఆదివారం ఉదయం దుర్వాసన రావడంతో స్థానికులు ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చి రాజు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. కాస్త సాయం పట్టమని స్థానికుల్ని అడిగితే కరోనా భయంతో ఎవరు కూడా ముందుకు రాలేదు. రాజు కరోనాతో చనిపోలేదని చెప్పినా కూడా వారు ధైర్యం చేయలేదు. దీంతో గత్యంతరం లేక పోలీసులు వెళ్లిపోయారు.
చాలాసేపటి తర్వాత రాజు మృతి వార్త తెలుసుకున్న రైల్వేలో అనాథ శవాల్ని తరలించే యువకుడు రాజు అనే యువకుడు వచ్చి మృతదేహాన్ని వస్త్రంలో చుట్టి, దాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు చాలా వాహనదారుల్ని సాయం కోరాడు. ఈసారి కూడా ఎవరూ ముందుకు రాలేదు. సమయానికి అంబులెన్సులు కూడా అందుబాటులో లేవు. దీంతో రాజుయే చివరకు తన సైకిల్‌పై మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించాడు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా ఇలాంటి విషాధభరిత మరణాలు ఇప్పుడు నిత్యకృత్యమయ్యాయి.
-----------------------------------------------------------------------
The corona virus is not only killing human beings as well as it is humanity also. A tragic incident that took place at the center of Kamareddy district in Telangana. According to a police report, Maharaj Ling Raju (44) of Eid Gau, Nirmal district, was working at the Kamareddy railway station. Due to the lockdown, Gandhi is currently occupying the Ganj area, filling the stomach with donor food packets. The king, who was living alone, died suddenly on Saturday night.
When locals complained of the stench on Sunday morning, the police decided to come and take the king's body to the district central hospital for a post mortem. If the locals asked for some help, no one would have come forward with the fear of corona. They did not even dare to say that the king did not die with Corona. This leaves the police or elsewhere.
Not long after the news of the king's death, a young man named Raju came to the orphanage to move the railway. This time, no one came forward. No ambulances were available at the time. The king finally rushed to the hospital on his bicycle. Such tragic deaths have now become routine due to corona worldwide.
Comments
Post a Comment