అవమానించబడ్డవారే ఆపద్బాంధవులవుతున్నారు..


"తబ్లీఘీ జమాత్".. అనే ముస్లింలలో ఓ వర్గం యావత్ దేశాన్ని తన వైపు తిప్పుకోవడమే కాకుండా, మిగతా ముస్లిం వర్గాలను కూడా మానసికంగా ఎదుర్కొనేలా చేసింది. కరోనా వ్యాప్తికి వీళ్లే కారణమని మీడియా మొరగడం, ఇందులోని నిజానిజాలు విచారించకుండా ప్రభుత్వం ప్రెస్ మీట్లు పెట్టి మరీ మీడియాకు వంతపాడటం నిన్నటి వరకు ఓ పద్ధతి ప్రకారంగా ముస్లింలను అవమానించే చర్యలు ఐకమత్యంగా కొనసాగాయి. కానీ, అవమానించబడ్డ ఆ జమాత్ వర్గీయులే ఇప్పుడు దేశంలో కరోనా మహమ్మారితో జరుగుతున్న పోరాటంలో అస్త్రంగా ఉపయోగపడనున్నారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారించబడి, క్వారంటైన్ లో ఉండి, తర్వాత నెగెటివ్ రిపోర్టులు చేబూని తమ ఇళ్లకు చేరిన ఆ జమాతీయులే ఇప్పుడు తాము రక్తదానం చేసి మిగతా కరోనా బాధితులకు ఔషధంగా ఉపయోగపడుతున్నారు. వారి రక్తంలోని ప్లాస్మా ద్వారానే డాక్టర్లు ఇప్పుడు కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి మహమ్మారికి ఇంతకు మించిన చికిత్స కూడా లేదు మరి! ఇప్పటి వరకు ఢిల్లీలో 200 మందికి పైగా జమాత్ సభ్యులు తమ ప్లాస్మాను దానం చేయగా, తమిళనాడులో వందల సంఖ్యలో తబ్లీఘీయులు ప్లాస్మా దానం కోసం హాస్పిటళ్ల ముందు బారులుదీరుతున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ తమకు జరిగిన అవమానాన్నిపట్టించుకోకుండా జమాతీయులు ప్లాస్మా దానానికి ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు.
-----------------------------------------------------------

One group of Muslims called "Tablighi Jamaat" .. not only turned the country towards him but also caused the other Muslim communities to face it. The practice of insulting Muslims, as a matter of fact, continues to be unanimous until yesterday when the media shouted that it was the cause of the corona outbreak. But the humiliated Jamaat community will now be used as a tool in the fight against the corona epidemic in the country. Those who have been diagnosed with coronavirus and returned to their homes in Quarantine and later on with negative reports are now donating blood and using it as a medicine for the rest of the corona victims. Doctors are now treating corona sufferers by plasma in their blood. At the moment there is no more treatment for the pandemic! More than 200 Jamaat members have donated their plasma in Delhi, while hundreds of Tablighi people in Tamil Nadu are flocking to hospitals for plasma donation, according to government sources. Commenting on the issue, Delhi CM Kejriwal said that it is commendable that the jamaatis have come forward with plasma donation instead of insulting them.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !