మధ్యప్రదేశ్ 'పందికొక్కులు' గరీబోళ్ల పిండి బుక్కుతున్నయ్ !
బీజేపీ పరిపాలిత మధ్యప్రదేశ్ లో గరీబోళ్ల పిండి మాయమైపోతోంది. ఏకంగా రేషన్ షాపుల్లోకి వస్తున్న పిండి సంచులు "పై" నుంచే తక్కువగా వస్తున్నాయని అక్కడి ఆహార పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం పేదలకు 10 కిలోల పిండిని ఇచ్చే పథకం ప్రారంభించింది. కానీ, ఆహార పౌర సరఫరాల శాఖ పంపిస్తున్న 10 కిలోల పిండి సంచిలో 1 నుంచి 3 కిలోల వరకు పిండి తక్కువగా వస్తోంది. ఈ విషయాన్ని ఆహార శాఖ అధికారులే స్వయంగా అంగీకరిస్తున్నారు.
ఈ కేసు మొదట గ్వాలియర్‌లో వెలుగులోకి వచ్చింది. ఇక్కడి కొత్త రహదారిపై ఉన్న హరి నిర్మల్ టాకీస్ ముందున్న రేషన్ షాపులో సంచి 10 కిలోలకు బదులు 8.85 కిలోలు మాత్రమే ఉందని లబ్ధిదారుడు ఫిర్యాదు చేశాడు. ఇది నిజమని తేలడంతో మిగతా ప్రాంతాల్లో సరఫరా అవుతున్న పిండి సంచులను పరిశీలించినప్పుడు కూడా ఇదే అక్రమం బయటపడింది. ప్రతిచోటా 1 నుంచి 3 కిలోల పిండి ప్రతి సంచిలో తక్కువ వస్తున్నట్లు తెలిసింది. ఈ అమానవీయ అవినీతి తెరపైకి వచ్చిన తరువాత, అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ అవినీతికి కొందరు రాజకీయ నాయకులే కారణమని, వారు అధికారులతో కుమ్మక్కై తమ పిండి బుక్కుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
-------------------------------------------------------------------
In the BJP-ruled Madhya Pradesh, the flour of marijuana is disappearing. Officials at the Food and Civil Supplies Department say flour bags coming into ration shops are falling "on". The Madhya Pradesh government has launched a scheme to supply 10 kg of flour to the poor due to the corona virus crisis. But in the 10 kg bag of food that the Food and Civil Supplies Department is delivering, 1 to 3 kg of flour falls short. The food department officials themselves agree.
The case first emerged in Gwalior. The beneficiary complained that the Hari Nirmal Talkies on the new road was only 8.85 kg instead of 10 kg at the previous ration shop. While this seems to be true, the same irregularity emerges when you look at the flour bags supplied elsewhere. Everywhere 1 to 3 kg of flour is reported to be coming low in each bag. After this inhumane corruption came to light, authorities began investigating. People are blaming some politicians for the corruption and they are bumping up their heads with the authorities.
Comments
Post a Comment