పెట్రోల్ అమ్మకాలు ఢమాల్ !
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఇంధనాలకు డిమాండ్ గణనీయంగా పడిపోయింది. వాహనాలు రోడ్ల మీదికి రావడం తగ్గిపోవడంతో మార్చిలో పెట్రోల్ అమ్మకాలు 17.6 శాతం, డీజిల్ విక్రయాలు 26 శాతం క్షీణించాయి. పలు విమానాలు రద్దు కావడంతో విమాన ఇంధన (ఏటీఎఫ్) అమ్మకాలు ఏకంగా 31.6 శాతం పడిపోయాయి. పెట్రోల్ అమ్మకాలు పడిపోవడం దాదాపు రెండున్నరేళ్లలో ఇదే తొలిసారి. ఏటీఎఫ్ విక్రయాలు 31.6 శాతం క్షీణించగా.. ఎల్‌పీజీ అమ్మకాలు మాత్రం 1.9 శాతం పెరగడం విశేషం.
---------------------------------------------------------------------------------
The demand for fuels has fallen sharply as a
nationwide lockdown is set to curb the spread of the corona virus. Petrol sales
fell 17.6 per cent in March, while diesel sales fell by 26 per cent. ATF sales
were down 31.6 per cent after several flights were canceled. This is the first
time in almost two and a half years that petrol sales have fallen. ATF sales
declined 31.6 per cent, while LPG sales increased by 1.9 per cent.
Comments
Post a Comment