"పద్మశ్రీ"నీ కబళించిన కరోన

పంజాబ్‌కు చెందిన పద్మ శ్రీ అవార్డు గ్రహిత నిర్మల్‌ సింగ్‌ ఖల్సా కరోనా వైరస్‌ సోకి మృతి చెందిన విషయం తెలిసిందే. నిర్మల్‌ సింగ్‌ మరణం అనంతరం ఆయన కుమార్తె (35) కూడా కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు వైద్యులు ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వెంటనే ఆమెను నిర్బంధ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఆమె తండ్రి కరోనా కారణంగా గురువారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. వైరస్‌ సోకడంతో అమృత్‌సర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. రెండు రోజుల వ్యవధిలోనే ఆయన కుమార్తెకు కూడా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆమె కాంటాక్ట్‌ అయిన వారందరినీ క్వారెంటైన్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.
---------------------------------------------------------------------------------
Punjab Padma Shri awardee Nirmal Singh Khalsa has died of coronavirus. After the death of Nirmal Singh, his daughter (35) also suffered from corona. In her tests conducted by doctors to this extent, Corona was positive. She was immediately rushed to the detention center and treated. Her father, Corona, passed away Thursday morning. He died after being infected with a virus at a hospital in Amritsar. Officials were alerted to his daughter's positives within two days. She was trying to move all of her contacts to Quarantine.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !