మంచికి చెబితే దాడి చేశారు..


ప్రముఖ నటుడు రియాజ్‌ఖాన్‌పై కొందరు వ్యక్తులు బుధవారం దాడి చేశారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో వివిధ రకాల పాత్రలు పోషించిన నటుడు రియాజ్‌ ఖాన్‌. ఈయన భార్య ఉమా రియాజ్‌ ఖాన్‌ కూడా నటినే. కాగా, రియాజ్‌ఖాన్‌ చెన్నై సమీపంలోని సముద్రతీరంలో ఉన్న పన్నయార్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. కాగా రియాజ్‌ఖాన్‌ బుధవారం ఉదయం ఆ ప్రాంతంలో వ్యాయామం చేసుకుంటున్నారు. అదేసమయంలో ఆ ప్రాంతంలో కొంతమంది గుంపుగా చేరి ముచ్చటించుకుంటున్నారు.

దీంతో రియాజ్‌ఖాన్‌ వారిని సమీపించి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం నిబంధనలు విధించింది మీరు వాటిని పాటిస్తూ ఇక్కడి నుంచి వెళ్లిపోండని హితవు పలికారు. అయితే, వారిలో కొందరు రియాజ్‌ఖాన్‌ను తిరగబడి మాట్లాడారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో గుంపులోని ఒకరు రియాజ్‌ఖాన్‌పై దాడి చేశారు. దీంతో కనత్తూరు పోలీసుస్టేషన్లో రియాజ్ఖాన్‌ ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు.
----------------------------------------------------------

On Wednesday, some people attacked the famous actor Riyaz Khan. He complained to the police. Actor Riyaz Khan has played various roles in Tamil, Malayalam and Telugu. His wife Uma Riaz Khan is also an actress. Riazkhan lives in the Pannayar area on the seaside near Chennai. Riazkhan was exercising in the area on Wednesday morning. At the same time, some people are joining in the area. Riazkhan approached them and said the coronavirus had spread. The government has imposed regulations and you are obliged to obey them. However, some of them reversed and spoke to Riyaz Khan. This resulted in a clash between the two factions. One of the mob attacked Riyaz Khan. Riazkhan lodged a complaint at Kanattur police station. Police are investigating.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !