భర్త నుంచి భార్యాపిల్లలకు..
జిల్లాలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఈ మహమ్మారి విజృంభిస్తున్న కేసులు నిత్యం వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఆదివారం మరో నలుగురికి కోవిడ్ పాజిటివ్ రావడంతో కలకలం రేగింది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య జిల్లాలో 26కు చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. శనివారం సాయంత్రం వరకు 21 కేసులు ఉండగా.. ఆ రాత్రి పొద్దుపోయాక మరో పాజిటివ్ వచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వీళ్లలో ముగ్గురు తప్ప మిగిలిన వాళ్లందరూ మత ప్రార్థనల కోసం ఢిల్లీ నిజాముద్దీన్‌కు వెళ్లొచ్చినవారని అధికారులు ధ్రువీకరించారు.
జల్‌పల్లి మున్సిపాలిటీలో..
ఒకే ఇంట్లో నలుగురు కుటుంబసభ్యులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. జల్‌పల్లి మున్సిపాలిటీకి చెందిన ఓ వ్యక్తి ఇటీవల మత ప్రార్థనలకు ఢిల్లీకి వెళ్లొచ్చాడు. తొలుత అతడికి ముందే కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన అధికారులు ఆయన కుటుంబసభ్యులను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఈనెల 2వ తేదీన వీరి నమూనాలను సేకరించి పరీక్షించారు. ఈమేరకు ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. అతడి భార్య, కుమారుడు, కుమార్తెకు సైతం కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందడంతో పాజిటివ్ వచ్చింది.ఢిల్లీ వెళ్లొచ్చిన వ్యక్తితో సన్నిహితంగా మెలగడంతోనే ఆయన నుంచి వీరికి వైరస్ వ్యాప్తి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. ఈ ముగ్గరు కూడా ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించారు. మరికొందరు సభ్యులకు నెగెటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం పాజిటివ్ వచ్చిన నలుగురిలో ముగ్గురు వీరే కావడం గమనార్హం. మరొకరు హఫీజ్‌పేటకు చెందిన వ్యక్తి అని అధికారులు తెలియజేశారు.
---------------------------------------------------------------------------------
Coronavirus spreads in the district People
are panicking as these epidemic cases continue to emerge. Four more Covid
positives came on Sunday. The number of corona positive cases has reached 26 in
the district. There were 21 cases till Saturday evening. Officials confirmed that all but three of
them had gone to Delhi Nizamuddin for religious prayers.
In Jalpally ..
The spread of coronavirus is a serious
concern for four family members in the same house. A man from Jalpally
Municipality recently visited Delhi for religious prayers. At first, coroner
virus positive came before him and alerted officials rushed his family members
to the Quarantine Center. Their samples were collected and tested on the 2nd
of this month. The results were revealed on Sunday. His wife, son and daughter
also got positive from spreading the Covid virus. These three were also
identified as primary contacts. Other members got negatives. All those who were
positive were rushed to Gandhi Hospital. Three of the four people who got
positive on Sunday were notable. Authorities said the other was a man from
Hafizpet.
Comments
Post a Comment