పిల్లాడు.. వేడుకున్నా వదల్లేదు..
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు యావద్దేశం లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ.. నిబంధనలను తుంగలో తొక్కి రోడ్లపైకి వస్తున్న వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు. కొన్ని చోట్ల ఖాకీలు ఎవరినీ నొప్పించకుండా కరోనాపై అవగాహన కల్పిస్తుంటే.. మరికొన్ని చోట్ల ప్రజల్ని ఇష్టానురీతిలో హింసిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. వార్తల్లో నిలిచే హింసాత్మక ఘటన ఒకటి తాజాగా వనపర్తిలో చోటుచేసుకుంది. లాక్డౌన్ నిబంధనలను పక్కన పెట్టి రోడ్డుపైకి వచ్చిన ఓ వ్యక్తిని అతడి కుమారుడి ముందే విచక్షణా రహితంగా చితకబాదారు పోలీసులు. తన తండ్రిని ఏమీ చేయోద్దంటూ పిల్లాడు మొత్తుకుని ఏడుస్తున్నా కనికరించకుండా అమానుషంగా ప్రవర్తించారు.
‘‘ డాడీ! వద్దు డాడీ.. వద్దు అంకుల్’ ’’ అంటూ ఒకవైపు తండ్రిని, మరోవైపు తండ్రిపైకి దూకుతున్న పోలీసులను పిల్లాడు బ్రతిమలాడుతూ కన్నీరుమున్నీరయ్యాడు.
ఆఖరికి చెప్పులు వేసుకోవటానికి కూడా అంగీకరించని పోలీసులు పిల్లాడిని, అతడి తండ్రిని జీపులో కుక్కి తీసుకెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. సదరు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ ఇలాంటి పోలీసుల ప్రవర్తనను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం. హోమ్ మినిష్టర్ మహమూద్ అలీ, తెలంగాణ డీజీపీలు దయజేసి ఇటువంటి సంఘటనలపై కఠిన చర్యలు తీసుకోండి. కొద్దిమంది పోలీసుల తిక్క చేష్టల వల్ల వేలాది మంది పోలీసులకు అపఖ్యాతి వస్తోంద’ని పేర్కొన్నారు.
-----------------------------------------------------------------
The announcement
of a lockdown has been announced to halt the spread of the corona virus. Acting
irresponsibly against the backdrop of the law .. The police are issuing batons
on those who come to the streets of Tungalo. In some cases the khakis educate
the corona without hurting anyone else. One of the latest violent incidents in
the news has taken place in Vanaparthi. A man who came on the road in defiance
of lockdown terms was indiscriminately shot in front of his son by police. The
child behaved inappropriately, crying and tearing at his father for nothing. Daddy!
No Daddy .. Nope, Uncle's telephone number is on the one hand and the father on
the other, the policeman jumping up and down, the boy is in tears.
Finally, the
police, who did not even accept sandals, took the child and his father to a
cook in a jeep. A video related to this has now gone viral. Telangana Minister
KTR responded to this. They were angry with the police. Responding to a Twitter
platform on Thursday .. Home Minister Mahmood Ali and Telangana DGPs, please
take strict action against such incidents. Thousands of policemen are notorious
for their inept acts.
Comments
Post a Comment