మానవత్వం కోసం 960 కిలోమీటర్ల ప్రయాణం


బెంగళూరుకు చెందిన 47 ఏళ్ల ఎస్.కుమారస్వామి అనే పోలీస్ కానిస్టేబుల్ తన మానవత్వ ప్రదర్శనతో ఇప్పుడు యావత్ కర్ణాటక రాష్ట్రానికి హీరో అయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు సిటీ పోలీస్ కంట్రోల్ రూంలో హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వర్తించే కుమారస్వామి ఏప్రిల్ 10న ఓ న్యూస్ ఛానల్ చూస్తుండగా, ధర్వాడ్ పట్టణానికి చెందిన ఉమేష్ అనే క్యాన్సర్ రోగి టీవీ యాంకర్కు ఫోన్ చేసి తనకు మందులు అవసరమయ్యే మందులు బెంగళూరులోనే దొరుకుతాయని, కానీ లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు తాను మందులు పొందలేక పోతున్నానని వాపోయాడు. ఆదివారం ఏప్రిల్ 12 వరకు మందులు తనకు చేరకుంటే ఆరోగ్యం విషమిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ వార్త చూసి చలించిన హెడ్ కానిస్టేబుల్ కుమారస్వామి తన హోండా యాక్టీవ్ మోపెడ్ పైనే ఆ మందులను తీసుకొని బెంగళూరు 960 కిలోమీటర్ల దూరమున్న ధర్వాడ్ పట్టణానికి బయలుదేరాడు. తన విధులకు ఆటంకం కలుగకుండా ఉదయం 4 గంటలకే బయలుదేరి ధర్వాడ్ లో ఉన్న ఉమేష్ కు కలిసి మందులను అందజేశాడు. ఏదో మాట వరుసకు తెస్తానని అన్నాడేమో గానీ ఇలా నిజంగా తీసుకొస్తాడని అనుకోలేదని, కానిస్టేబుల్ మానవత్వానికి తాను ఆశ్చర్యపోయానని ఉమేష్ తెలిపాడు. కానిస్టేబుల్  కుమారస్వామి మాట్లాడుతూ.. కేవలం ఒక రోగిని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సాయం చేశానని చెప్పి తన ఔదార్యాన్ని చాటాడు.
------------------------------------------------------------------------------------

47-year-old S Kumaraswamy, a police constable from Bangalore, has now become the hero of Karnataka. The details are as follows. Kumaraswamy, who performs the head constable duties at the Bangalore City Police Control Room, was watching an news channel on April 10, when a man named Umesh, a cancer patient from Dharwad phoned a TV anchor and found the drugs he needed in Bangalore. But he joked that he was now unable to get drugs because of the lockdown. He expressed concern that his health would worsen if the drugs were not available until Sunday April 12. 

Head constable Kumaraswamy was shocked by the news and took the drugs on his Honda Active Moped and set off for Dharwad, 960 km from Bangalore. Without interrupting his duties, he left at 4 am and handed over drugs to Umesh in Dharwad. Umesh said he did not think that he would ever bring it up, but that he was surprised by the constable's humanity. Constable Kumaraswamy said that he had done this with the intention of helping only one patient.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !