9 మంది ఐక్య రాజ్య సమితి సిబ్బందికి కరోనా!

ప్రపంచ మానవాళికి దడ పుట్టిస్తున్న మహమ్మారి కరోనా ఐక్య రాజ్య సమితికీ పాకింది. జెనీవాలోని 9 మంది యూఎన్కార్యాలయ సిబ్బందికి కరోనా సోకినట్టు ఐక్యరాజ్య సమితి సమాచార డైరెక్టర్అలెసాండ్రా వెలుసి తెలిపారు. ఈమేరకు ఆమె లేఖలో పేర్కొన్నట్టు జిన్హువా వార్త సంస్థ మంగళవారం వెల్లడించింది. అయితే, ప్రస్తుత సమయంలో బాధితులకు సంబంధించిన వివరాలేవీ చెప్పబోమని ఆమె స్పష్టం చేశారు. వైరస్వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. స్థానిక స్విట్జర్లాండ్ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి కోవిడ్‌-19 పై పోరుకు పనిచేస్తామని తెలిపారు.

కాగా, మార్చి 28 వెలుసి మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 78 మంది యూఎన్ సిబ్బందికి కరోనా సోకిందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. జెనీవాలోని యూఎన్కార్యాలయంతోపాటు.. అక్కడే ఉన్న అంతర్జాతీయ లేబర్ఆర్గనైజేషన్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తమ సిబ్బందిలో కొందరికి కరోనా సోకిందని ప్రకటించాయి. ఈనేపథ్యంలో యూఎన్సిబ్బందిలో దాదాపు అందరూ ఇప్పుడు టెలీ వర్కింగ్చేస్తున్నారు. కరోనా నియంత్రణకు తమ వంతు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలెవరూ తమ కార్యాలయాలకు రాకుండా చూస్తున్నామని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఇక 85 లక్షల జనాభా ఉన్న స్విట్జర్లాండ్లో మంగళవారం ఉదయం వరకు 16,176 కరోనా పాజిటివ్కేసులు నమోదు కాగా.. 373 మంది మరణించారు.
---------------------------------------------------------------------------------
United Nations Director of Information Alessandra Valli said Corona had infected 9 UN office workers in Geneva. The Xinhua news agency said on Tuesday that she had mentioned in a letter. However, she made it clear that she would not give any details about the victims at the present time. We are taking all precautions to prevent the spread of the virus.


The local government of Switzerland, together with the World Health Organization, will work on the Kovid-19.

Speaking to the media on March 28, he said that Corona had infected 78 UN staff around the world. Meanwhile, the International Labor Organization and the World Health Organization, along with the UN office in Geneva, have announced that some of their staff are infected with corona. In this scenario, almost all of the UN staff are now working on the tele.

The United Nations said it was doing its part to regulate corona and that people were not coming to their offices. As of Tuesday morning, there were 16,176 corona-positive cases in Switzerland, with a population of 85 million.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !