'నిజాముద్దీన్'లో 7000 మందికి నెగెటివ్


కరోనా కారణంగా యావత్ దేశం చూపును తన వైపు తిప్పుకొని, వార్తల్లో నిలిచిన ఢిల్లీలోని నిజాముద్దీన్ దర్గాహ్ ప్రాంతం ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే నిజమొకటి బట్టబయలైంది. ఈ ప్రాంతం నుంచే మొత్తం భారతదేశానికి కరోనా వ్యాపించిందని పనిగట్టుకొని ప్రచారం చేసిన కొన్ని మీడియా సంస్థలు ఈ వార్తను జీర్ణించుకోలేక పోతున్నాయి. ఇక్కడి నుంచే కరోనా ప్రబలడం ఎక్కువైందని అరిచిన పలు మైకులు ఇప్పుడు మూగబోయాయి.

ఇక అసలు వార్తలోకి వస్తే.. నిజాముద్దీన్ ప్రాంతం నుంచే కరోనా ఎక్కువగా వ్యాపించింది కాబట్టి  స్థానికంగా ఎంతమందిని కబలించిందోననే అనుమానాలను పటాపంచలు చేసే నిజాన్ని అధికారులు ప్రకటించారు. వారి ధ్రువీకరణ ప్రకారం నిజాముద్దీన్ మర్కజ్ చుట్టుపక్కల ఉన్న బస్తీల్లో మొత్తం 1900 ఇండ్లలో నివసించే 7000 మందికి కరోనా నిర్ధారిత పరీక్షలు చేయగా.. అందరికి నెగటివ్ రిపోర్టులు వచ్చాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయా బస్తీలవాసులు ప్రశాంత ఊపిరి పీల్చుకున్నారు. ఈ వార్తను ప్రముఖ వార్తా సంస్థ "ది టైమ్స్ ఆఫ్ ఇండియా" కూడా అధికారికంగా ప్రచురించింది. కానీ, 'అధికారానికి' కొమ్ము కాసే కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని దాచిపెడుతూ ఎప్పటిలాగే తమ స్వామి భక్తిని చాటుకుంటున్నాయి ! 
-------------------------------------------------------------------------------

The Nizamuddin Dargah area of ​​Delhi, which has been on the news since the coronation turned its eyes on the country, has now become a breath of fresh air. Some media outlets who pretend that corona spread from this region to the whole of India are unable to digest the news. From this point, many of the mics that were supposed to have increased corona were now dumb.

In fact, the news is that the corona has spread from the Nizamuddin area, so the authorities have declared the truth to be suspicious of how many locals have been robbed. According to their affidavit, Corona conducted a thorough screening of 7000 people living in 1900 houses in Basti area around Nizamuddin Markaz.

After hearing the matter, the hostages breathed a sigh of relief. The news was officially published by the leading news agency "The Times of India". But some media outlets that are horn of 'power' are hiding this and always maintaining their devotion.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !