ఒకే ఇంట్లో 23 మంది !
లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఒకే ఇంట్లో ఉంటున్న 23 మందిని ఇంట్లోనే లాక్‌డౌన్ చేశారు అధికారులు. ఈ సంఘటన ఒరిస్సాలోని నవరంగపూర్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నవరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయం వెనుక ఉన్న ఇంటిలో 23 మంది వ్యక్తులు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఇంటి కుటుంబసభ్యులతో పాటు చత్తీస్‌ఘడ్ సుకుమకు చెందిన కొందరు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరికొందరు ఉంటున్నట్లు తెలుసుకున్నారు. కరోనా వైరస్ నుంచి రక్షించుకునేందుకు ప్రజలు లాక్‌డౌన్, సామాజిక దూరాలను పాటించాలని ప్రభుత్వం నిర్ధేశించినా.. ఆదేశాలను తుంగలో తొక్కి ఒకే ఇంటిలో 23 మందికి పైగా ఉండటంతో ఆగ్రహించిన అధికారులు ఆ ఇంటిని లాక్‌డౌన్ చేశారు.
వారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంటిలోనుంచి బయటకు రాకూడదని ఆదేశించారు. అత్యావసర సరుకులు తామే సమకూర్చుతామని భరోసా ఇచ్చారు. ఇంటి చుట్టూ పోలీసులను కాపలా పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పరిసర ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇతర ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో ఒకే ఇంట్లో ఉండటంతో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ ఇంటి పరిసరాలకు ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వారందరినీ 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి వైద్య పరీక్షలు జరిపిన అనంతరం జనజీవనంలోకి అనుమతిస్తామని తెలిపారు.
---------------------------------------------------------------------------------
Authorities have locked 23
people in the same house in violation of lockdown rules. The incident took
place on Sunday in Nawarpurpur district of Orissa. According to police, 23
persons were found in a house behind the office of the Rural Development Agency
in the center of Nawrangpur district. Some members of Chhattisgarh Sukuma and
others from Andhra Pradesh have learned that there are family members. The
government has ordered people to follow the lockdown and social distance to
protect against coronavirus.
They were ordered not to
leave the house under any circumstances. Ensuring that the goods are provided
for themselves. The police were guarded around the house. People living in the surrounding area are
panicking. In other areas they object to the large number being in the same
house. Officials were warned not to visit the neighborhood. All of them will be
allowed to live in the quarantine for 14 days after medical tests.
Comments
Post a Comment