చితాభస్మం కోసం వెతుకులాట !



కరోనా మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాలోని వుహాన్‌లో వ్యాధి అదుపులోకి రావటంతో ఇప్పడు జనం తమ ఆత్మీయుల సమాధులను వెదికే పనిలో పడ్డారు. కోవిడ్‌-19 బారిన పడి మరణించినవారిని కుటుంబసభ్యులకు అందించకుండానే అధికారులే అంత్యక్రియలు నిర్వహించారు. మరణించినవారి నుంచి వ్యాధి ఇతరులకు సోకే ప్రమాదం ఉండటంతో అధికారులు కఠినంగా వ్యవహరించారు. ప్రజలెవరూ ఇండ్లనుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోవటంతో ఆత్మీయుల అంత్యక్రియలకు స్మశానానికి కూడా వెళ్లలేక కుటుంబసభ్యులు ఇండ్లలోనే మౌనంగా ఇంతకాలం రోధించారు.

తాజాగా ప్రజల సంచారంపై ఆంక్షలను సడలించటంతో వుహాన్‌లోని స్మశానవాటికల వద్ద కరోనా మృతుల బంధువులు భారీ సంఖ్యలో క్యూ కట్టినట్లు ఆ దేశ మీడియా సంస్థ సయిచిన్‌ తెలిపింది. ఒక స్మశానవాటికవద్ద రెండు రోజుల్లో 2500 మంది మృతులకు సంబంధించిన చితాభస్మాలను వారి బంధువులకు అందజేసినట్లు వెల్లడించింది. మరో చోట 3500 మంది మృతులకు సంబంధించిన వస్తువులను వరుసగా పేర్చిన ఫోటోను కూడా ఆ సంస్థ ప్రచురించింది. 

చాలామంది కుటుంబసభ్యులు తమవారి చివరి జ్ఞాపకాల కోసం రెండుమూడు గంటలు ఎదురుచూడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే కరోనా వల్ల నగరంలో ఎంతమంది మరణించారు. ఎంతమంది చితాభస్మాలను వారి కుటుంబసభ్యులకు అందించేందుకు సిద్ధం చేశారన్న లెక్కలేవీ తమవద్ద లేవని అధికారులు తెలిపారు.
---------------------------------------------------------------------------------
In Wuhan, China, where the coronary pandemic was born, people are now searching for the graves of their souls. Officers carried out the funeral without providing the family members of Kovid-19 victims. Authorities have been tough on the risk of infection from the dead to others. Family members could not even go to the cemetery for the funeral, as family members were unable to get out of their homes.

Coroner's death relatives have queued up at the cemeteries in Wuhan as the latest public restrictions have been relaxed, the country's media company Saichin said. A cemetery revealed that as many as 2,500 dead bodies were handed over to their relatives in two days. Elsewhere, the company also published a series of photos stacking up to 3500 casualties.

Many family members expressed their hope that their last remembrances would be made for two to three hours. But how many people died in the city due to corona. Officials said they had no account of how many ashes were prepared to be delivered to their family members.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !