మహామహులకు మహమ్మారి
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా శుక్రవారం వెల్లడించారు. గత 24 గంటల నుంచి స్వల్పంగా వైరస్ లక్షణాలు కనిపించాయని, పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం తాను స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు చెప్పారు. కరోనాని ఎదుర్కొనేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాను ప్రభుత్వాన్ని నడిపిస్తానని తెలిపారు. బ్రిటన్ వైద్య శాఖ మంత్రి మ్యాట్ హ్యాంకాక్‌కు కూడా వైరస్ సోకింది.
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 పెద్ద
కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌కు కరోనా సోకింది. భార్య కెమెల్లాతో కలిసి స్కాట్లాండ్లోని నివాసంలో ఐసొలేషన్లో ఉన్నారు. లైంగిక నేరారోపణలు రుజువుకావడంతో
23 ఏండ్ల జైలు
శిక్షను ఎదుర్కొంటున్న
ప్రముఖ హాలీవుడ్
నిర్మాత హార్వే
విన్స్టీన్కు జైళ్లో కరోనా
సోకింది. భారత్లో కరోనా బారిన
పడిన మొదటి
సెలబ్రిటీ కనికాకపూర్, ఆస్కార్
అవార్డు గ్రహీత
టామ్ హాంక్స్,
ఆయన భార్య
రీటా విల్సన్
కూడా కరోనా
బారినపడ్డారు. కెనడా ప్రధానమంత్రి
జస్టిన్ట్రూడో
సతీమణి సోఫీ
ట్రూడోకు, హాలీవుడ్ నటి
ఓల్గా కురిలెంకో
కూడా కరోనా
బారినపడ్డారు.
హాలీవుడ్ నటులు క్రిస్టోఫర్ హివ్‌జు, ఇందిర వర్మ, హాలీవుడ్ నటి రాచెల్ మాథ్యూస్, నటుడు ఇడ్రిస్ ఎల్బా, భార్య సబ్రినాకు కరోనా వైరస్ సోకింది. ఎన్‌బీఏ స్టార్ కెవిన్ దురంత్‌కు వైరస్ నిర్ధారణ అయింది. కరోనా బారినపడిన తొలి బ్రిటన్ పార్లమెంట్ సభ్యురాలు, వైద్య ఆరోగ్య మంత్రి నదినే డోరిస్. కరోనా సోకిన మొదటి అమెరికన్ సెనేటర్ రాండ్ పాల్, తొలి అమెరికా కాంగ్రెస్ సభ్యుడు మారియో డయాజ్ బలార్ట్. మరో సభ్యుడు బెన్ మెక్‌ఆడమ్స్‌కు కరోనా సోకింది. ఇరాన్ డిప్యూటీ వైద్య శాఖ మంత్రి ఇరజ్ హరిర్చి కరోనా బారినపడ్డారు. ఆస్ట్రేలియా హోం శాఖ మంత్రి పీటర్ డుటన్‌కు పాజిటివ్ రావడంతో దవాఖానలో ఉంచారు.
-------------------------------------------------------------------------------
Corona infected British Prime Minister Boris Johnson.
This was revealed on Twitter on Friday. The virus has been seen for the past 24
hours and coronary positives have been tested. He said he is currently in
self-incarceration. He said he would lead the government through a video
conference to combat Corona. Britain's Health Minister Matt Hancock has also
been infected.
Prince Charles, the eldest son of Britain's Queen
Elizabeth-2, has been infected. With his wife, Camella, Isolation is living in
Scotland. Corona is in jail for Harvey Weinstein, a prominent Hollywood
producer facing a 23-year prison sentence after being found guilty of sexual
offenses. Corinna was also the first celebrity in India to be affected by
Corinacapur, Oscar winner Tom Hanks and his wife Rita Wilson. Corona has also
been hit by Canadian actress Prime Minister Justin Trudeau's daughter Sophie
Trudeau and Hollywood actress Olga Kurilenko.
Hollywood stars Christopher Hivju, Indira Verma,
Hollywood actress Rachel Matthews, actor Idris Elba and wife Sabrina have been
infected with the corona virus. NBA star Kevin Durant has been diagnosed with
the virus. Corona was the first British parliamentarian to be affected by the
health minister, Nadine Doris. Corona is the first American senator to be
infected by Rand Paul and the first US congressman, Mario Diaz Ballard. Corona
was infected by another member, Ben McAdams. Iran's deputy medical minister
Iraj Haririchi Corona has been affected. Australia's Home Minister, Peter
Dutton, has been put on the brink of being positive.
Comments
Post a Comment