కమల్‌కు కరోనా కష్టాలు..

విలక్షణ నటుడు, మక్కల్ నీది మైయామ్ పార్టీ అధినేత కమల్ హాసన్కు చెన్నై మున్సిపల్ అధికారులు చుక్కలు చూపించారు. కమల్ హాసన్కు కరోనా అంటూ అధికారుల అత్యుత్సాహం కారణంగా మీడియాలో హల్చల్ కావడం.. రూమర్లు విస్తృతంగా ప్రచారం కావడంతో కమల్ హసన్ స్పందించాల్సి వచ్చింది. అసలు ఇంతకు కమల్ విషయంలో అధికారుల అత్యుత్సాహం ఎంతటి గందరగోళానికి కారణమైందంటే..
చెన్నై మున్సిపల్ అత్యుత్సాహం
చెన్నై మున్సిపల్ అధికారులు కరోనా బాధితుల ఇంటికి స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనావైరస్ సోకిన వ్యక్తుల నివాసాలకు స్టిక్కర్లు అంటించి ఇతరులను హెచ్చరించారు. క్రమంలో ఆళ్వారుపేటలోని కమల్ హాసన్ ఇంటికి కూడా స్టిక్కర్ అంటించడం మీడియాలో వివాదానికి దారి తీసింది.
స్వదేశంలోనే కమల్
కమల్ ఇంటికి స్టిక్కర్ అంటించడంపై పార్టీ వర్గాలు స్పందిస్తూ.. గత జనవరి నుంచి కమల్ స్వదేశంలోనే ఉన్నారు. ఆయన విదేశాలకు వెళ్లిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఎంఎన్ఎం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఎలాంటి ఎంక్వరీ లేకుండా, స్క్రూట్నీ లేకుండా కమల్ హాసన్ ఇంటికి స్టిక్కర్ అతికించారు అని చెప్పారు.
కమల్కు కరోనా అంటూ
వాస్తవాలు తెలుసుకోకుండా మరో ఇంటికి బదులు కమల్ ఇంటికి కరోనా ఉందంటూ స్టిక్కర్ అతికించి వెళ్లడంతో అంశం తమిళ మీడియాలో వైరల్గా మారింది. దాంతో కమల్ హసన్ స్వీయ గృహ నిర్బంధంలో ఉండటంతో అంతా నిజమే అనుకొన్నారు. మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో అసలు విషయాన్ని కమల్ మీడియాకు వివరించారు.
అంతా గౌతమి వల్లే..
కమల్ ఇంటికి కరోనా స్టిక్కర్ వివాదంపై గ్రేటర్ చెన్నై కార్పోరేషన్ కమిషనర్ జీ ప్రకాశ్ స్పందించారు. ఇటీవల నటి గౌతమీ (మాజీ జీవిత భాగస్వామి) దుబాయ్ నుంచి ఇటీవల తిరిగి వచ్చారు. ఆమె పాస్ట్పోర్టులో అడ్రస్ కమల్ ఇంటి పేరుపై ఉండటంతో సిబ్బంది ఆయన ఇంటికి స్టిక్కర్ అతికించారు. ఇదే గందరగోళానికి దారి తీసింది.
---------------------------------------------------------------------------------
Chennai Municipal Authorities have spotted the iconic actor, Makkal Nedi Miami Party chief Kamal Haasan. Kamal Haasan's coronation was due to the hyperactivity of the media due to the enthusiasm of the authorities. In the case of Kamal, the authorities' enthusiasm for the cause of the confusion ..

Chennai Municipal Supremacy

Chennai Municipal authorities have started a program to stick stickers at the corona victims' home. Stickers have alerted others to the homes of people infected with coronavirus. To this end, sticking the sticker to Kamal Haasan's house in Alwarpet has caused controversy in the media.

Kamal at home

Party sources have reacted to the sticker being pasted on Kamal's house. There were no filings that he went abroad. MNM is currently working to strengthen the party. Kamal Haasan said the sticker had been pasted to the house without any scrutiny.

Corona to Kamal !

The matter became viral in the Tamil media, with the sticker being pasted over Kamal's home instead of another house without knowing the facts. With Kamal Hasan being self-detained, he thought everything was real. News in the media has gone viral. Kamal explained the matter to the media.

It's all because of Gautami..

Greater Chennai Corporation Commissioner Jee Prakash has reacted to the coroner's sticker controversy at Kamal's home. Actress Gautamy (ex-spouse) recently returned from Dubai. The staff had pasted the sticker on his house as the address was on Kamal's surname in her passport. This is what caused the confusion.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !