కరోనా వ్యాక్సిన్ కనుగొన్న హైదెరాబాదీ ?!


యావత్ ప్రపంచం ఎదురు చూసేలా చేస్తున్న ఒకేఒక్క విషయం ఏంటంటే కరోనా కి వ్యాక్సిన్ ఎప్పుడు కనుగొంటారు? మనం మళ్లీ మామూలు జీవితం ఎప్పుడు గడుపుతాం? పగలు, రాత్రి ఇదే టెన్షన్! డాక్టర్లు, శాస్త్రవేత్తలు కూడా అదే పనిలో తలమునకలై ఉన్నారు. అయితే ఎట్టకేలకు మన హైదరాబాద్ ప్రొఫెసర్ కరోనాకి వ్యాక్సిన్ కనుగొన్నారు. 

ఏదైనా వైరస్ కి వ్యాక్సిన్ కనుగొనడానికి సుమారు అయిదారేళ్ల టైం పడుతోంది.. వ్యాక్సిన్ కనుగొనడం దానికి అనుమతి రావడం, క్లినికల్ ట్రయల్స్ ఇలా అనేక రకాల తంతుల మధ్య వ్యాక్సిన్ విడుదల చేయబడుతుంది. కాని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంత లేదన్నా ఒకట్రెండు ఏళ్లు అయితే పట్టొచ్చని అంచనా . కాని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (HCU) కి చెందిన ప్రొఫెసర్ సీమా మిశ్రా కరోనాని నివారించేందుకు వ్యాక్సిన్ కనిపెట్టారు.. ఈ విషయాన్ని స్వయంగా HCU నే ప్రకటించింది. 

హెచ్‌సీయూలో బయో కెమిస్ట్రీ విభాగంలో పని చేసే ప్రొఫెసర్ సీమా మిశ్రా దీన్ని తయారు చేసారు. ఆ వ్యాక్సిన్ కి టీ-సెల్ ఎపిటోమ్ అని పేరు కూడా పెట్టారు. ఏ వ్యాక్సిన్ కూడా కనిపెట్టగానే ఉపయోగంలోకి రాదు , అనేక టెస్టుల తర్వాత దానిని అమలులోకి తీసుకొస్తారు. ప్రస్తుతం టీ – సెల్ ఎపిటోమ్ కూడా టెస్టింగ్ స్టేజ్ లో ఉంది. మరిన్ని పరిశోదనలు చేస్తే ఇది అమలులోకి వచ్చేది లేనిది తెలుస్తుంది. అందులో భాగంగా ఈ అధ్యనాన్ని కెమ్ రిక్సివ్ అనే జర్నల్ కి పంపారు.

సీమా మిశ్రా కనిపెట్టిన వ్యాక్సిన్ మనిషి శరీరంలో కరోనా వైరస్ ను మాత్రమే చంపేస్తుందని, ఆరోగ్యవంతంగా ఉన్న మరే ఇతర కణాలను అది హాని చేయదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తన ప్రకటణలో వెల్లడించింది. ఇప్పటి వరకు సరైన మందు లేని కారణంగా రకరకాల మందుల్ని ప్రయోగిస్తూ ఫలితాలు పొందుతున్నాయి..ఈ సమాచారాన్ని అంతర్జాతీయంగా దేశాలన్ని శేర్ చేసుకుంటున్నాయి. 

వాక్సిన్ అందుబాటులోకి వస్తే సమస్య ఒక కొలిక్కి వస్తుంది. ఒక వేళ ఈ వ్యాక్సిన్ కనుక సక్సెస్ అయితే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్ ని ఓడించిన ఘనత మన భారత్ కే చెందుతుంది. మానవాళి మనుగడ కోసం అయినా వాక్సిన్ పరిశోధనలు సక్సెస్ కావాలని తొందరలో అందుబాటులోకి రావాలని కోరుకుందాం.
---------------------------------------------------------------------------------

 When is the coronavirus vaccine found to be the only thing that makes the world look forward to it? When will we live our normal lives again? Day and night tension! Doctors and scientists are doing the same thing. Eventually, however, our Hyderabad professor Coronaki discovered the vaccine.

It takes about five years to find a vaccine for any virus. But it is estimated that one or two years may not be enough. But Professor Seema Mishra of the University of Hyderabad (HCU) invented the vaccine to prevent coronavirus.

It was prepared by Professor Seema Mishra, who works in the Department of Biochemistry at HCU. The vaccine is also named the T-cell epitome. No vaccine is in use as soon as it is invented, and it is implemented after several tests. Currently the Tea - Cell epitome is also in the testing stage. Further research shows that this is not the case. The study was sent to the journal Chem Rexiv.

The vaccine invented by Seema Mishra will only kill the coronavirus in man's body and will not harm any other healthy cells, the University of Hyderabad said in a statement. As of now there is a lack of optimal medication and the results of experimenting with different drugs. This information is shared by countries internationally.

The problem comes with a colic if the vaccine becomes available. If this vaccine succeeds, then India will be credited with defeating the virus that is sweeping the world. Let's hope that vaccine research should be made available soon enough for humanity's survival.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !