నిర్భంధంలో సుహాసిని పుత్రరత్నం


సింగర్ కనికాకపూర్ కరోనావైరస్ వివాదం మీడియాలో హాట్హాట్గా నడుస్తుంటే.. మరో సెలబ్రిటీ కుటుంబ సభ్యుడు ప్రాణాంతక వ్యాధి ఉండవచ్చనే అనుమానంతో స్వీయ నిర్బంధం విధించుకొన్నారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం, నటి సుహాసిని కుమారుడు నందన్ మణిరత్నం ఇటీవల లండన్ నుంచి చెన్నైకి చేరుకొన్నారు. అయితే కరొనావైరస్ ముప్పుతో ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. వివరాల్లోకి వెళితే..

గృహ నిర్బంధంలో నందన్

నందన్ మణిరత్నం తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. లండన్ నుంచి రాగానే గదిని ఐసోలేటెడ్ రూమ్గా మలచుకొని స్వీయ నిర్బంధం విధించుకొన్నారు. అతడికి కావాల్సిన వసతులను, అవరసరాలను గ్లాస్ కిటికి నుంచి మాట్లాడుతూ ఏర్పాటు చేస్తున్నారు. తన కుమారుడితో మాట్లాడుతున్న సుహాసిని వీడియోను నటి కుష్బూ విడుదల చేసింది.

సుహాసిని గ్లాస్ కిటికీలో మాట్లాడుతూ..

వీడియోలో సుహాసిని మాట్లాడుతూ.. స్వీయ నిర్బంధంలో ఉన్న నా కొడుకుతో గ్లాస్ కిటికి ద్వారా మాట్లాడుతున్నాను. అతడు మార్చి 18 లండన్ నుంచి తిరిగి వచ్చారు. కానీ అతడికి కరోనా పాజిటివ్ పాజిటివ్గా రాలేదు. అయినా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకొన్నాడు. అతడికి మా కుటుంబం సహకారం అందిస్తున్నది అని సుహాసిని చెప్పడం గమనార్హం.

14 రోజులు ఇంట్లోనే ఉంటా..

తల్లి సుహాసిని మాటలకు సమాధానం ఇస్తూ.. ప్రతీ ఒక్కరికి నమస్కారం. గత ఐదు రోజుల క్రితం లండన్ నుంచి తిరిగి వచ్చాను. అప్పటి నుంచి ఒంటరిగా ఇంట్లోనే ఉంటున్నాను. మరో 14 రోజులు ఇంట్లో నుంచి బయటకు రాను. చాలా బోరుగా ఉన్నప్పటికీ.. ఇతరుల క్షేమం కోసం ఇంతకంటే ఏం చేయగలను అని నందన్ మణిరత్నం అన్నారు.
---------------------------------------------------------------------------------


Singer Kanikakapur coronavirus controversy has been running hot in the media. Nandan Mani Ratnam, son of veteran director Mani Ratnam and actress Suhasini, recently moved to Chennai from London. Caronavirus, however, remains at home with the threat. Going into the details ..

Nandan under house arrest..

Nandan Maniratnam is staying with his parents. Upon arrival from London, a room was converted into an isolated room and self-imposed. Speaking from the glass window, he is arranging his accommodations. Actress Kushboo has released a video of Suhasini talking to her son. Speaking of Suhasini in the video .. I am talking through the glass window with my son who is in self-incarceration. He returned from London on 18 March. But he did not get corona positive. Yet he took these steps carefully. It is noteworthy to mention Suhasini that our family is supporting him.

Stay at home for 14 days ..

Mother Suhasini in reply to the words .. Everybody is hi. I just returned from London five days ago. I have been staying at home alone ever since. I will be out of the house for another 14 days. Nandan Maniratnam said what can be done for the well-being of others..

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !