కరోనా నివారణ కోసం స్వీయ కట్టడి !


కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా పలు గ్రామాల ప్రజలు సమష్ఠిగా కృషిచేస్తున్నారు. తామే కాదు తమ ఊరు కూడా బాగుండాలని, ఊర్లో ఎవరూ ఈ వైరస్‌ బారిన పడకూడదని గ్రామాల పొలిమే రల్లో చెక్‌పోస్టులు పెట్టారు. ఒకరు రాళ్లు అడ్డం పెడితే, మరొకరు కంచె పాతారు. ‘వేరే గ్రామస్థులు మా ఊరికి రావొద్దు.. మేము వేరే ఊరికి వెళ్లం’ అంటూ స్పష్టంచేస్తున్నారు. 

గండికామారంలో..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం గండికామారం గ్రామంలోకి నిత్యం భూపాలపల్లి నుంచి పదుల సంఖ్యలో పలువురు బైక్‌లపై వస్తుండటంతో.. సోమవారం స్థానికులు రోడ్డుకు అడ్డంగా ఇనుప కంచెను ఏర్పాటుచేశారు. అలాగే, గండికామారం వాసులు పక్క గ్రామాలకు వెళ్లకుండా కట్టడి చేశారు. గండికామారం గ్రామస్థులు చేసిన పనిని పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, సోషల్‌ మీడియా ద్వారా అభినందిస్తున్నారు.

స్వచ్ఛంద మద్దతు..


లాక్‌డౌన్‌కు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని పలు గ్రామాల ప్రజలు తమ గ్రామానికి ఎవరూ రావద్దంటూ ఇతర ప్రాంతాల నుంచి గ్రామానికి వచ్చే రోడ్లను మూసివేశారు. తాము కూడా ఎక్కడికీ వెళ్లమని, ఇతరులు కూడా తమ గ్రామానికి రావద్దంటూ ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలం మార్లవాయి గ్రామ శివారులో స్థానికులు చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేసుకున్నారు. గ్రామస్థులు కూడా బయటకు వెళ్లకుండా నిలిపివేస్తామని సర్పంచ్‌ కనక ప్రతిభ తెలిపారు.
--------------------------------------------------------------------------------------------------------------------------

People on Prevention Way

People from many villages are working hard to prevent the spread of coronavirus. Checkposts were placed on the outskirts of the villages to ensure that not only their home but also their hometowns were affected.

In Gandikamaram..

Jayashankar Bhupalapalli district Mahamuttaram Mandal In the village of Gandikamaram, there are tens of thousands of bikes coming from Bhupalapalli on a regular basis. Also, the residents of Gandikamaram were blocked from going to the neighboring villages. The work of the villagers of Gandikamaram has been appreciated by the public, officials and social media of many villages.

Volunteer Support..

People voluntarily support the lock down. People from many villages in Nallagonda and Suriyapet districts have blocked roads from elsewhere so that no one can come to their village. They have decided not to go anywhere and others should come to their village. Locals have set up a check post in the village suburb of Marlavai in Jainur Zone of Kumra Bhim Asifabad district.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !