కరోనా ఎఫెక్ట్.. షిర్డీ ఆలయం మూసివేత
కరోనా వైరస్ ప్రభావంతో మహారాష్ట్రలోని షిర్డీ ఆలయాన్ని మూసివేయనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఆలయాన్ని ట్రస్ట్ అధికారులు మూసివేయనున్నారు. భక్తులు షిర్డీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయాన్ని మూసివేశారు. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను కూడా మూసేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల ఆలయంలో శ్రీవారిని టైంస్లాట్ టోకెన్ ద్వారా తక్కువ సమయంలో దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మహారాష్ట్రలో కరోనా వైరస్‌తో 68 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా కేసులు 36 నమోదు అయ్యాయి. ఇప్పటికే సీఎం ఉద్ధవ్ థాకరే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్‌ను మూసివేశారు. అన్ని ఎన్నికలను కూడా వాయిదా వేశారు.
------------------------------------------------------------------------------------------------------
Shirdi temple in Maharashtra to be shut down due to corona virus Shri Sai Baba Sansthan Trust has announced that the temple will be closed at 3 pm on Tuesday. The temple authorities will close the temple until further orders. Officials have advised pilgrims to postpone Shirdi's journey. The Siddhi Vinayaka temple in Mumbai has already been closed following the corona outbreak. The Taj Mahal in Agra was also closed. Arriving at the Thirumala Temple in Andhra Pradesh, Shrivari is being arranged to be visited in a short time by a timelot token.
A 68-year-old man has died of coronavirus in Maharashtra. This has resulted in a nationwide death toll of three. In Maharashtra alone, the highest number of 36 coronal cases were reported. CM Uddhav Thackeray has already conducted a review with top officials. The CM ordered the alliance to take action against the corona.
Comments
Post a Comment