2 నెలలు.. 15 లక్షలు..!



కరోనా కేసుల వృద్ధిరేటులో కాస్త తగ్గుదల కనిపిస్తున్నదంటూ స్వల్ప ఉపశమనం కలిగించిన కేంద్రం.. 24 గంటలు గడువకముందే బాంబు పేల్చింది. విదేశాల నుంచి గత రెండు నెలల్లో మన దేశంలోకి దాదాపు 15 లక్షల మంది వచ్చారని తెలిపింది. వారిపై సరైన నిఘా లేదని వెల్లడించింది. వెంటనే రాష్ర్టాలు చర్యలు తీసుకోవాలని, వారిపై నిఘా పెంచాలని సూచించింది. మేరకు కేంద్ర క్యాబినెట్సెక్రటరీ రాజీవ్గుహా గురువారం అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఇమ్మిగ్రేషన్బ్యూరో ఇచ్చిన వివరాలమేరకు జనవరి 18 తేదీ నుంచి మార్చి 23 తేదీ మధ్య 15 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు భారత్కు వచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఆయా రాష్ర్టాల్లో పరిశీలనలో ఉన్న విదేశీ ప్రయాణికుల సంఖ్యకు, అసలు సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఉన్నదన్నారు. 15 లక్షల మంది విమానాల ద్వారా వచ్చినవారు మాత్రమేనని, సముద్రమార్గంలో, అంతర్జాతీయ సరిహద్దుల గుండా వచ్చినవారు అదనమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి
కొత్త కేసులు
దేశంలో గత 24 గంటల్లో 75 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్అగర్వాల్పేర్కొన్నారు. దీంతో బాధితుల సంఖ్య 724కు పెరిగింది. వైరస్బారినపడి మరొకరు మృతిచెందడంతో.. మరణాల సంఖ్య 17కు చేరింది. బాధితుల్లో 66 మంది కోలుకున్నారని లవ్అగర్వాల్వెల్లడించారు. కరోనావైరస్కు ఔషధాన్ని కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టినసాలిడారిటీ ట్రయల్‌'లో భారత్త్వరలో పాలుపంచుకోనున్నదని ఐసీఎంఆర్ప్రతినిధి రామన్ఆర్గంగఖేద్కర్తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 30 బృందాలు కరోనాకు విరుగుడు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. భారత బృందం సైతం వ్యాక్సిన్తయారీకి కృషి చేస్తున్నదన్నారు. 40వేల వెంటిలేటర్లను కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. వలస కార్మికులకు, ఇతర రాష్ర్టాలకు చెందిన విద్యార్థులకు, ఉద్యోగులకు వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని అన్ని రాష్ర్టాలను కోరామన్నారు. హోటళ్లు, అద్దె నివాసాలు, హాస్టళ్లను తెరిచే ఉంచాలని ఆదేశించామన్నారు
--------------------------------------------------------------------------------
The slightest relief is that there is a slight decrease in the rate of growth of corona cases. Over 15 lakh people have arrived in the country in the last two months. Revealed that there was no proper intelligence on them. States should take immediate action and increase intelligence on them. To this end, Union Cabinet Secretary Rajiv Guha wrote a letter to the government secretaries of all states and union territories on Thursday. According to the Immigration Bureau, 15 lakh international travelers arrived in India between January 18 and March 23. There is a difference between the actual number of foreign travelers currently under consideration in the respective states. According to government sources, these 15 lakhs were the only ones who came by air, and by sea and international borders.


75 new cases
75 new cases have been registered in the last 24 hours in the country, Union Health Ministry Secretary Joint Agarwal said. The number of victims has increased to 724. The death toll has risen to 17 when another person succumbs to the virus. Love Agarwal said 66 of the victims were recovered. India will soon be involved in a Solidarity Trial by the World Health Organization to find a cure for coronavirus, ICMR spokesman Raman R Gangakhedkar said. More than 30 groups around the world say Corona is trying to find an antidote. The Indian team is also working on the vaccine. Said to be buying 40 thousand ventilators. All States are requested to provide accommodation and lodging facilities for migrant workers, students and employees of other states. Hotels, rental residences and hostels are ordered to remain open.



Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !