కొవిడ్-19పై హ్యాకథాన్ / Hackathon on Covid-19
కరోనా వైరస్ వ్యాప్తిని టెక్నాలజీతో అరికట్టడానికి పరిష్కారాలు చూపేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆన్‌లైన్ హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్టు టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ (టీఎస్‌ఐసీ) సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నుంచి వారంపాటు హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ హ్యాకథాన్‌లో విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, ఇంక్యుబేటర్లు, టెక్నాలజిస్టులు, కోడర్లు, వైద్యసేవలు అందించేవారు, స్టార్టప్‌లు, మెడికల్ ఇన్‌స్టిట్యూట్లు పాల్గొనవచ్చని సూచించారు. ఈ హ్యాకథాన్‌లో పోటీపడే ఆసక్తిగలవారు bit.ly/coronahackathon లేదా 8123123434 ఫోన్ నంబర్ ద్వారా గానీ సంప్రదించాలని సందీప్‌కుమార్ మక్తాల విజ్ఞప్తి చేశారు.
------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------
Comments
Post a Comment