అగ్రరాజ్యంలో ఒకేరోజు 10 వేల కేసులు

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో క‌రోనా ర‌క్క‌సి విజృంభిస్తున్న‌ది. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 10 వేల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 54 వేల‌కు చేరింది. పాజిటివ్ కేసుల‌తోపాటే అమెరికాలో మృతుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతున్న‌ది. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే అక్క‌డ 150 మంది క‌రోనా పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 775కు చేరింది. 

మిగ‌తా రాష్ట్రాల‌తో పోల్చితే న్యూయార్క్‌లో క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ది. మంగ‌ళ‌వారం అమెరికా మొత్తంగా 150 మంది మృతిచెంద‌గా.. అందులో 53 మ‌ర‌ణాలు ఒక్క న్యూయార్క్‌లోనే న‌మోద‌య్యాయి. అమెరికాలో న‌మోదైన మొత్తం 775 మ‌ర‌ణాల్లో కూడా న్యూయార్క్‌లో న‌మోదైన మ‌ర‌ణాలే 201 ఉన్నాయి. కరోనా పాజిటివ్ కేసులు కూడా న్యూయార్క్‌లోనే ఎక్కువ‌గా ఉంది. మంగ‌ళ‌వాం నాటికి అమెరికా మొత్తంగా 54 వేల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వగా.. ఒక్క న్యూయార్క్‌లోనే 25 వేల కేసులు న‌మోద‌య్యాయి.
---------------------------------------------------------------------------------
Corona in Trump's Place 

10,000 cases identified in One Day

The corona epidemic is developing in the United States. More than 10,000 new corona positive cases were reported on Tuesday alone. The total number of corona cases in the country reached 54 thousand. The number of deaths in the US with positive cases is also rising. About 150 coronation patients lost their lives on Tuesday alone. The number of dead is 775.

New York has a higher Corona intensity compared to the rest of the state. On Tuesday, 150 people were killed in the US. Of these, 53 were killed in New York alone. Of the total 775 deaths in the US, 201 are the best in New York. Corona positive cases are also high in New York. As of Tuesday, there were 54,000 Corona positive cases in the United States alone. In New York alone, 25 thousand cases were reported.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !