Posts

బాబు పేరు 'కొవిడ్'‌.. పాప పేరు 'కరోనా'..

Image
ఛత్తీస్ ‌ గఢ్ ‌ కు చెందిన ఓ మహిళ పండంటి ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది . ఆ పిల్లలకు ఆమె ముద్దుగా కొవిడ్ , కరోనా అని నామకరణం చేసింది . బాబు పేరును   కొవిడ్   గా , పాప పేరును కరోనాగా పెట్టింది . ఉత్తరప్రదేశ్ ‌ కు చెందిన ప్రీతివర్మ (27) అనే గర్భిణి తన భర్తతో కలిసి రాయ్ ‌ పూర్ ‌ లో ఉంటుంది . గర్భిణికి నెలలు నిండడంతో మార్చి 26 న రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి . దీంతో ఆమెను 102 వాహనంలో రాయ్ ‌ పూర్ ‌ లోని డాక్టర్ ‌ బీఆర్ ‌ అంబేడ్కర్ ‌ మెమోరియల్ ‌ ఆస్పత్రికి తరలించారు . మార్చి 27 న తెల్లవారుజామున ఒకే కాన్పులో పాప , బాబుకు జన్మనిచ్చింది . తనకు , పిల్లలకు గుర్తుండేలా వారికి నామకరణం చేయాలని భర్తతో తన అభిప్రాయాన్ని పంచుకుంది . ఇద్దరి అభిప్రాయం మేరకు పాపకు కరోనాగా , బాబుకు   కొవిడ్   గా నామకరణం చేశారు . తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు . మార్చి 22 న జనతా కర్ఫ్యూ రోజున ఉత్తరప్రదేశ్ ‌ గోరఖ్ ‌ పూర్ ‌ లో పుట్టిన పాపకు కరోనా అని పేరు పెట్టారు . మార్చి 30 న డియోరియా జిల్లాలోని ఖుకుందు గ్రామంలో జన్మ...

కరోనాకు కారణం పిల్లులా ?

Image
కరోనా వ్యాప్తికి పిల్లులే కారణమా అంటే.. కాదనలేమని అంటున్నారు పరిశోధకులు! బెల్జియం దేశంలో ఓ పిల్లి ద్వారా  యజమానికి కరోనా సంక్రమించింది తేలడంతో శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ దిశగా పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పిల్లుల్లో ఒకదాని నుంచి ఇంకోదానికి వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే బాంబును  పేల్చారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు ఓ పిల్లికి కరోనా వైరస్ ఇంజక్షన్ ఇచ్చి, దీంతోపాటు మరో రెండు పిల్లులను కలిపి ఒకే ఉంచారు. తర్వాత వాటిని పరీక్షిస్తే ఇంజక్షన్ చేసిన పిల్లితో ఉంచిన మరో పిల్లికి వైరస్ సోకినట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత  పరిస్థితుల్లో మనుషులు పిల్లుల నుంచి దూరంగా ఉండటమే మంచిదని సూచించారు. ఇదిలా ఉంటే కుక్కలు, కోళ్లు, పందులకు కరోనా వైరస్ సోకే అవకాశాలు కూడా లేనట్లు  తేల్చారు. కానీ పిల్లుల నుంచి జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు. --------------------------------------------------------------------------------- Cats are the cause of corona outbreaks. Scientists are now investigating the cause of coronavirus infection in Belgium by ...

కరోనాకు క్యూబన్ వైద్యుల సవాల్

Image
కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ఇప్పటి వరకు 186 దేశాలకు విస్తరించిన ఈ మహ్మమారిని.. ఎదర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకమవుతున్నాయి. అయితే కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకూ వైరస్‌ సోకడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనగా మారింది. ఈ క్రమంలో అమెరికాకు కూతవేటు దూరంలో ఉన్న అతిచిన్న దేశం క్యూబా కరోనా బాధిత దేశాలకు అండగా నిలుస్తోంది. పక్కనున్న శత్రుదేశం అమెరికాను కరోనా పీడిస్తున్న తరుణంలో ఆ దేశానికి వైద్యులను పంపి ఆదుకుంటోంది. యూఎస్‌కే కాదు క్యూబా వైద్యులు నేడు ప్రపచ వ్యాప్తంగా అనేక దేశాలకు సేవలందిస్తున్నారు. క్యూబా.. ఒక చిన్న దేశం.. మన దేశంలో ఓ జిల్లా అంత విస్తీర్ణంలో ఉంటుంది. కేవలం కోటి మంది జనాభా ఉన్న ఈ దేశం ప్రపంచంలోనే డాక్టర్ల కార్ఖానాగా వెలుగొందుతోంది. జనాభా పరంగా చూస్తే హైదరాబాద్ కంటే తక్కువ జనాభాగల దేశం. కానీ ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన వైద్యం ప్రజలందరికీ అందిస్తోంది. ఈ కరోనా కష్టకాలంలో క్యూబా వైద్యులు అనేక దేశాలకు స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. క్యూబాపై అనేక ఆంక్షలు విధించి ఆ దేశాన్ని ఛీదరించుకునే అమెరికాలో, ఇటలీలో కరోనా వైద్య సే...

ఏపీలో 259 మంది ఖైదీల విడుదల

Image
కారాగారాలపై కరోనా ఎఫెక్ట్ ‌ పడకుండా ఆంధ్రప్రదేశ్ ‌  జైళ్ల శాఖ జాగ్రత్తలు పాటించింది . దీనిలో భాగంగా ఇప్పటికే 259 మందిని మధ్యంతర బెయిల్ ‌ పై విడుదల చేయగా మిగిలిన వారు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు . విడుదల అయిన వారంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ , సొంత ఇంటి ( హౌస్ ‌ ఐసోలేషన్ ‌) లో ఉండాలి . నెల రోజుల తర్వాత తిరిగి వారి వారి జైళ్లకు వెళ్లాల్సి ఉంటుంది . ఇందుకు సంబంధించి జైళ్ల శాఖ డైరెక్టర్ ‌ జనరల్ ‌ ( డీజీ ) మహ్మద్ ‌ హసన్ ‌ రేజా అన్ని జైళ్ల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు . తీసుకున్న జాగ్రత్తలు ... ► కరోనాను జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఖైదీల రద్దీగా ఉండే జైళ్లలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు .   ► ప్రస్తుతం రాష్ట్రంలోని 81 జైళ్లలో 6,930 మంది ఖైదీలున్నారు . వీరికి కరోనా వైరస్ ‌ సోకకుండా జైలు అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టారు .  ► జైలు బ్యారక్ ‌ లలో తక్కువ మందిని ఉంచడం , భోజనం సమయంలో పది మంది చొప్పున అనుమతిస్తున్నారు ...

పిల్లాడు.. వేడుకున్నా వదల్లేదు..

Image
కరోనా వైరస్ ‌   వ్యాప్తిని అడ్డుకునేందుకు యావద్దేశం లాక్ ‌ డౌన్ ‌ ప్రకటించిన సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ .. నిబంధనలను తుంగలో తొక్కి రోడ్లపైకి వస్తున్న వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు .  కొన్ని చోట్ల ఖాకీలు   ఎవరినీ నొప్పించకుండా కరోనాపై అవగాహన కల్పిస్తుంటే .. మరికొన్ని చోట్ల ప్రజల్ని ఇష్టానురీతిలో హింసిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు . వార్తల్లో నిలిచే హింసాత్మక ఘటన ఒకటి   తాజాగా వనపర్తిలో చోటుచేసుకుంది . లాక్ ‌ డౌన్ ‌ నిబంధనలను పక్కన పెట్టి రోడ్డుపైకి వచ్చిన ఓ వ్యక్తిని అతడి కుమారుడి ముందే విచక్షణా రహితంగా చితకబాదారు పోలీసులు . తన తండ్రిని ఏమీ చేయోద్దంటూ పిల్లాడు మొత్తుకుని ఏడుస్తున్నా కనికరించకుండా అమానుషంగా ప్రవర్తించారు . ‘‘ డాడీ ! వద్దు డాడీ .. వద్దు అంకుల్ ’ ’’  అంటూ ఒకవైపు తండ్రిని , మరోవైపు తండ్రిపైకి దూకుతున్న పోలీసులను పిల్లాడు బ్రతిమలాడుతూ కన్నీరుమున్నీరయ్యాడు . ఆఖరికి చెప్పులు వేసుకోవటానికి కూడా అంగీకరించని పోలీసులు   పిల్లాడిని ,...