బాబు పేరు 'కొవిడ్'.. పాప పేరు 'కరోనా'..
ఛత్తీస్ గఢ్ కు చెందిన ఓ మహిళ పండంటి ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది . ఆ పిల్లలకు ఆమె ముద్దుగా కొవిడ్ , కరోనా అని నామకరణం చేసింది . బాబు పేరును కొవిడ్ గా , పాప పేరును కరోనాగా పెట్టింది . ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రీతివర్మ (27) అనే గర్భిణి తన భర్తతో కలిసి రాయ్ పూర్ లో ఉంటుంది . గర్భిణికి నెలలు నిండడంతో మార్చి 26 న రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి . దీంతో ఆమెను 102 వాహనంలో రాయ్ పూర్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు . మార్చి 27 న తెల్లవారుజామున ఒకే కాన్పులో పాప , బాబుకు జన్మనిచ్చింది . తనకు , పిల్లలకు గుర్తుండేలా వారికి నామకరణం చేయాలని భర్తతో తన అభిప్రాయాన్ని పంచుకుంది . ఇద్దరి అభిప్రాయం మేరకు పాపకు కరోనాగా , బాబుకు కొవిడ్ గా నామకరణం చేశారు . తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు . మార్చి 22 న జనతా కర్ఫ్యూ రోజున ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ లో పుట్టిన పాపకు కరోనా అని పేరు పెట్టారు . మార్చి 30 న డియోరియా జిల్లాలోని ఖుకుందు గ్రామంలో జన్మ...