టెకీలకు గుటగుట !
అమెరికాలో కరోనా దెబ్బకు ఓవైపు మనుష్యులే పిట్టల్లా రాలిపోతున్నారు. మరోవైపు
కంపెనీలు కూడా తమ వల్ల వ్యాపారం చేయలేమంటూ బోర్డులను కిందకు పడేస్తున్నాయి. ప్రపంచంలో
అగ్రరాజ్యమైనా అమెరికాలోనే ఈ పరిస్థితి ఉంటే ఇతర దేశాల్లో ఈవిధంగా కరోనా మహమ్మారి విజృంభిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించలేము. ప్రస్తుతం
అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందో తప్ప తరగడం లేదు. దానికితోడు
మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ఆ దేశ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకున్నారు. కొన్నిచోట్ల
మాత్రమే పరిస్థితి ఈ విధంగా ఉంది. మరికొన్ని
చోట్ల లాక్డౌన్ కారణంగా
ప్రజల ప్రాణాలకు పెద్దగా ముప్పు ఎదురవనప్పటికీ అక్కడ పనిచేస్తున్న వ్యాపార సంస్థలకు మాత్రం పెద్ద నష్టాన్నే కలిగించింది. దాంతో
చాలాచోట్ల కంపెనీలు బోర్డ్ను తిప్పే పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయుల పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది. ఓవైపు
ట్రంప్ తీసుకువచ్చిన
ఇమ్మిగ్రేషన్ సంస్కరణల
కారణంగా గతంలోలాగా ఏదో ఓ చోట కొలువు చూసుకుని బయటపడే పరిస్థితులు నేడు లేవు. దాంతో
తాము ఇండియాకు వెనక్కి వెళ్ళిపోదామా అంటే తిరిగి వెళ్ళడానికి విమానాలు కూడా లేవు. దీంతో
వాళ్ళు ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నారు.
రవాణా, ట్రావెలింగ్
రంగాలు ప్రపంచవ్యాప్తంగా స్తంభించడంతో ఈ రంగాలకు చెందిన కంపెనీలు తమ ప్రాజెక్టుల నుంచి ఉద్యోగులను తీసేయడం ప్రారంభించాయి. దీంతో
ఉద్యోగులు వెంటనే మరో ప్రాజెక్టులో చేరలేని పరిస్థితి ఏర్పడింది. భారత్లో ఉన్న ఔట్ సోర్సింగ్
ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలానే ఉన్నట్టు కనపడుతోంది. భారత్లోని టెక్ కంపెనీల
క్లైంట్లు ఎక్కువగా అమెరికాకు చెందిన వారే కావడం.. వీరంతా
కరోనా కారణంగా తమ ప్రాజెక్టులను ముందుకు నడిపే స్థితిలో లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. దీంతో
భారత్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేయాల్సి వస్తోంది. భారత్కు చెందిన అనేక టెక్నాలజీ కంపెనీలు ప్రాజెక్టులు లేకపోయినా ఉద్యోగులను నడుపుకుంటూ వచ్చే సామర్థ్యం కలిగి ఉన్నాయి.
మరోవైపు కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికమాంద్యం తలెత్తితే లక్ష ఉద్యోగాలు పోవడం తథ్యమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని
ప్రభావం విదేశీ ఉద్యోగులపై ముఖ్యంగా భారతీయులపై ఎక్కువగా ఉండవచ్చంటున్నారు. అమెరికాలో
హెచ్1బీ
వీసాపై సింహభాగం భారతీయులే పనిచేస్తుండటమే దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో
హెచ్1బీ
వీసాపై పనిచేస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు.
ఉద్యోగం కోల్పోయినవారిని, ఇతరులను
ఆదుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం
ముందుకు వచ్చింది. ఉద్యోగం
పోయిన వాళ్లే కాకుండా.. సొంత
వ్యాపారం చేసుకునే వారిని, ఫ్రీ
లాన్సర్లను కూడా నిరుద్యోగ భృతికి
అర్హులుగా ప్రభుత్వం కొత్త ఆదేశాలిచ్చింది. దీంతో
ఉద్యోగం పోయిన వారు, ఉద్యోగం
లేని వారు ఇలా అనేక మంది నిరుద్యోగ భృతికి
దరఖాస్తు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇలా
అమెరికా వ్యాప్తంగా 66 లక్షల
మంది తాజాగా తమ మొదటి వారం నిరుద్యోగ భృతికి
దరఖాస్తు చేసినట్టు లేబర్ డిపార్ట్మెంట్
ప్రకటించింది. ఈ
లెక్కల ద్వారా అమెరికా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో ఆరు శాతం మంది నిరుద్యోగ భృతికి
దరఖాస్తు చేసినట్టుగా అధికారులు చెప్పారు. రానున్న
రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కాగా..
అమెరికాలో 2007-09 సంవత్సరాల్లో నిరుద్యోగ భృతి
కోసం అత్యధికంగా 6,65,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ
సమయంలో మాంద్యం కారణంగా 87 లక్షల
మంది ఉద్యోగాలు పోయాయి. తరువాత
నేడు దగ్గరదగ్గరగా నిరుద్యోగభృతికి దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య కనిపిస్తోంది.
------------------------------------------------------------------------------
One side the death of people is increasing day by day in America, and on
the other hand, Companies are falling down the boards because they can't do business. If
this is the case in the world, the United States, and the United States, it is
impossible to imagine how the corona epidemic would succeed in other countries.
Currently, the number of corona cases in the United States is rising, not increasing
daily. In addition, the death toll has risen and the people of the country have
taken their lives. Only a few times this is the case. Elsewhere, the lock-down posed a
significant risk to the businesses that operate there, though not as a major threat
to the lives of the public. Many companies appear to be turning the board
around.
Against this backdrop, the situation of the Indians working in the
companies is looking good. Because of the immigration reforms that Trump has
brought about, there are no such things today as in the past. Should they go
back to India, there will be no return flights. They are in desperate need of
what to do.
As the transportation and travel sectors worldwide stagnate, companies from
these sectors have begun to pull employees from their projects. This created a
situation where employees could not immediately join another project. The
situation of outsourcing employees in India seems to be similar. Clients of
tech companies in India are mostly from the US. This means that employees working in India
will be forced out of the project. Many technology companies in India have the
ability to keep employees running when there are no projects.
On the other hand, experts estimate that millions of jobs will be lost if
the recession causes the corona pandemic. The impact is likely to be greater on
foreign workers, especially Indians. Analysts believe that this is due to the
fact that the majority of Indians are working on H-1B visa in the US. This is a
concern for those working on the H-1B visa.
Comments
Post a Comment