‘ఆ డైరీ’లో ఏముంది? ఆమెను ‘దేశద్రోహి’ అని ఎందుకంటున్నారు?


క‌రోనావైర‌స్ విజృంభించిన తొలి నాళ్ల‌లో వుహాన్‌లో రోజువారీ జీవితాన్ని వెలుగులోకి తెచ్చిన ఓ ప్ర‌ముఖ ర‌చ‌యిత డైరీని ఇప్పుడు ఇంగ్లిష్‌లోని అనువ‌దిస్తున్నారు. జ‌న‌వ‌రి నుంచే వుహాన్‌లో చోటుచేసుకుంటున్న‌ ప‌రిణామాలను, తన అనుభ‌వాల‌ను ఆన్‌లైన్ డైరీగా రాయడం మొద‌లుపెట్టారు 65 ఏళ్ల ఫేంగ్ ఫేంగ్. అప్ప‌టికి క‌రోనావైర‌స్ సంక్షోభం చైనాకు మాత్ర‌మే ప‌రిమితం. ఆమె డైరీ బాగా వైర‌ల్ అయ్యింది. క‌రోనావైర‌స్ పుట్టిన వుహాన్‌లో ఏం జ‌రుగుతుందో చైనాలో ల‌క్ష‌ల మంది తెలుసుకునేందుకు ఇది తోడ్ప‌డింది. క‌రోనావైర‌స్ వ్యాప్తి భ‌యంతో ప్ర‌పంచంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించిన తొలి న‌గ‌రం వుహాన్‌. అప్పుడు చైనా ప్ర‌ధాన భూభాగంతో పాటు ప్ర‌పంచానికీ ఈ న‌గ‌రంతో సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి.

లాక్‌డౌన్ పొడిగిస్తున్న‌కొద్దీ ఫేంగ్ పాపులారిటీ కూడా పెరిగింది. దీంతో ఆమె డైరీలోని సంగ‌తుల‌ను వేరే భాషల్లోకి అనువ‌దిస్తామంటూ ప్ర‌చుర‌ణ‌క‌ర్త‌లు ముందుకువస్తున్నారు. అయితే, అంత‌ర్జాతీయంగా ఆమెకు వ‌స్తున్న గుర్తింపుపై చైనా గుర్రుగా ఉంది. ఆమె రిపోర్టింగ్‌ను చాలా మంది చైనావాసులు త‌ప్పుప‌డుతున్నారు. కొంద‌రైతే ఆమెను దేశ‌ద్రోహిగా చెబుతున్నారు.

ఇంత‌కీ డైరీలో ఏముంది?
జ‌న‌వ‌రి చివ‌రిలో వుహాన్‌లో చైనా లాక్‌డౌన్ విధించింది. అప్పుడు న‌గ‌రంలో జ‌రుగుతున్న సంగ‌తుల‌ను ఫేంగ్.. చైనా సోష‌ల్ మీడియా వేదిక వీబోలో ఆన్‌లైన్ డైరీగా రాయ‌డం మొద‌లుపెట్టారు. బ‌ల‌వంతంగా ఐసొలేష‌న్‌లో పెట్ట‌డంతో ప‌డే మాన‌సిక ఒత్తిడి మొదలుకుని.. అనునిత్యం ఎదుర‌వుతున్న స‌వాళ్ల వ‌ర‌కూ అన్నింటినీ ఆ డైరీలో ఆమె ప్ర‌స్తావించారు. "భ‌యం, ఆవేద‌న‌, కోపానికి ఆమె గొంతుకనిచ్చారు. అంతేకాదు ల‌క్ష‌ల మంది తోటి పౌరుల్లో ఆమె మ‌ళ్లీ ఆశ‌లు చిగురించేలా చేశారు" అని ప్ర‌చుర‌ణ సంస్థ‌ హార్పర్ కొలిన్స్ వ్యాఖ్యానించింది. "క‌రోనావైర‌స్‌కు క‌ళ్లెం వేసే క్ర‌మంలో చోటుచేసుకున్న‌‌ అధికార దుర్వినియోగం, సామాజిక అన్యాయం, ఇత‌ర స‌మ‌స్య‌ల గురించి కూడా ఆమె డైరీలో ప్ర‌స్తావించారు. దీంతో కొన్ని వివాదాల‌కు ఆమె కేంద్ర బిందువుగా మారారు." విమానాశ్ర‌యం నుంచి త‌న కుమార్తెను తీసుకురావడానికి వెళ్లిన‌ప్పుడు జ‌రిగిన సంగ‌తుల‌ను ఆమె ఓ క‌థ‌నంలో వివ‌రంగా రాసుకొచ్చారు. ఇది ‘సండే టైమ్స్‌’లో ప్ర‌చురిత‌మైంది. "రోడ్ల మీద కార్లు కానీ పాద‌చారులు కానీ క‌నిపించ‌లేదు. ఆ రోజుల్లో భ‌యం రాజ్య‌మేలేది. నేను, మా అమ్మాయి ఎప్పుడూ మాస్క్‌లు ధరించే ఉండేవాళ్లం" అని ఆమె వివ‌రించారు.

అంత‌ర్జాతీయ గుర్తింపు ఎలా వ‌చ్చింది?
చైనా తమ దేశంలో వార్తలను పూర్తిగా నియంత్రిస్తుంది. స్వ‌తంత్రంగా ప‌నిచేసే వార్తా సంస్థ‌లే లేవు. ఈ త‌రుణంలో అంద‌రూ విశ్వ‌స‌నీయ స‌మాచారం కోసం ఫేంగ్ ఫేంగ్‌పై ఆధార‌ప‌డ్డారు. ర‌చయిత‌గా ఆమెకున్న పేరు కూడా ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెంచింది. "ఈ దేశానికి మీలా నిజాయితీతో ప‌నిచేసే ర‌చ‌యిత‌లు కావాలి. ప్ర‌భుత్వం విడుద‌ల చేసే స‌మాచారాన్ని ఎవ‌రూ న‌మ్మ‌ట్లేదు"అని ఓ వీబో వినియోగ‌దారుడు వ్యాఖ్యానించిన‌ట్లు ద ఇండిపెండెంట్ న్యూస్ వెబ్‌సైట్ పేర్కొంది. "ఆమె డైరీతో పాటు పేరు ప్ర‌ఖ్యాత‌లూ చాలా త్వ‌ర‌గా చైనాను దాటి విదేశాల‌కు వెళ్లాయి."

చైనాకు కోపం ఎందుకు?
చైనా సోష‌ల్ మీడియాలో సైబ‌ర్ జాతీయ‌వాదం స‌ర్వ‌సాధార‌ణం. చైనాను విమ‌ర్శించినా, ఆరోప‌ణ‌లు చేసినా, అవ‌మానించినా వేల మంది చైనా పౌరులు సోష‌ల్ మీడియాలో విరుచుకుప‌డుతుంటారు. ఇలాంటి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న ర‌చ‌యిత‌ల్లో ఫేంగ్ ఫేంగ్ మొద‌టివారేమీ కాదు. క‌రోనావైర‌స్ ప్ర‌పంచ దేశాల‌కు పాకిన స‌మ‌యంలో.. అస‌లు చైనా దీనికి ఎలా క‌ళ్లెం వేసేంద‌నే అంశంపై అంద‌రి దృష్టీ ప‌డింది. అదే స‌మ‌యంలో చైనాలో ఫేంగ్ ఫేంగ్‌పై విప‌రీతంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అప్పుడే ఫేంగ్ ఫేంగ్ డైరీపై ప‌శ్చిమ దేశాల మీడియా దృష్టి ప‌డింది. "ఆమె రాసిన డైరీ అంత‌ర్జాతీయ ఎడిష‌న్‌గా మారింది. అమెజాన్‌లోనూ దీన్ని విక్ర‌యించారు. దీనిపై చైనావాసులు విమ‌ర్శ‌లు గుప్పించారు" అని వాట్స్ ఆన్ వీబో వెబ్‌సైట్ పేర్కొంది. "వుహాన్‌లో వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి అనుస‌రించిన తీరును విమ‌ర్శిస్తూ ఫేంగ్ రాసిన డైరీ అనువాదాన్ని చైనా ప్ర‌త్య‌ర్థుల‌ చేతికి దొరికిన ఆయుధంగా చాలా మంది చైనావాసులు భావించారు." ఆమెను వాస్త‌వాలు క‌ళ్ల‌కు క‌డుతున్న రిపోర్ట‌ర్‌గా కంటే చైనా దేశ ద్రోహిగా ఎక్కువ మంది అభివ‌ర్ణించారు. కొంద‌రైతే పాపులారిటీని ఆమె సొమ్ము చేసుకుంటోంద‌నీ వ్యాఖ్య‌లు చేశారు. "ఆత్య‌యిక ప‌రిస్థితినీ ఆమె అవ‌కాశంగా మల‌చుకుంటోంది. ఇది చాలా నీచ‌మైన ప‌ని" అని ఓ వీబో వినియోగ‌దారుడు వ్యాఖ్యానించారు. అమెరికా - చైనాల మ‌ధ్య దౌత్య‌ప‌ర‌మైన వాగ్వివాదాలు న‌డుస్తున్న త‌రుణంలో అమెరికా ప్ర‌చుర‌ణ సంస్థ హార్పర్‌ కోలిన్స్‌.. ఆమె డైరీని ప్ర‌చురించ‌డంతో ఈ విమ‌ర్శ‌లు మ‌రింత పెరిగాయి. మ‌రోవైపు ఫేంగ్ ఫేంగ్‌పై త‌మ వైఖ‌రినీ చైనా ప్ర‌భుత్వ మీడియా కుండ బ‌ద్ద‌లుకొట్టిన‌ట్టు స్ప‌ష్టంచేసింది.

"విదేశీ మీడియా సంస్థ‌ల్లో ఆమెను ఆకాశానికెత్తుతూ వ‌స్తున్న క‌థ‌నాలను చైనాలో చాలా మంది ముప్పుగా చూస్తున్నారు. చైనా ప్ర‌జ‌ల కృషిని దొంగ‌దెబ్బ తీసేందుకు ప‌శ్చిమ దేశాలు ఆమెను ఆయుధంగా వాడుకుంటున్నాయి" అంటూ గ్లోబ‌ల్ టైమ్స్‌లో ఓ క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. "వుహాన్‌లో చీక‌టి కోణం గురించి మాత్ర‌మే ఆమె డైరీలో ప్ర‌స్తావించారు. క‌రోనావైర‌స్ క‌ట్ట‌డికి స్థానికులు చేసిన కృషి, దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న మ‌ద్ద‌తును ఆమె ప‌ట్టించుకోలేదు" అని విమర్శించారు.

ఆమె డైరీకి స్పంద‌న ఎలా వ‌స్తోంది?
గ‌త శుక్ర‌వార‌మే అమ్మ‌కాలు మొద‌లైన ఈ పుస్తకంపై ప్ర‌జ‌ల‌ స్పంద‌న అప్పుడే చెప్ప‌డం కొంత క‌ష్ట‌మే. అయితే ఆమె నిజాయితీ మీద న్యూయార్క్ టైమ్స్ ప్ర‌శంస‌లు కురిపించింది. "లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆమె ద‌య‌నీయ‌మైన జీవితం గ‌డిపి ఉండొచ్చు. కానీ చాలా ధైర్యంగా క‌లంప‌ట్టారు" అని వ్యాఖ్యానించింది. "76 రోజుల వుహాన్ లాక్‌డౌన్‌కు సంబంధించి దీనిలో కీల‌క‌మైన, స‌వివ‌ర‌, భ‌యాన‌క సంగ‌తులు ఉన్నాయి. చైనీస్ భాషలోని డైరీలో కనిపించే లోతైన భావోద్వేగాలు ఇంగ్లిష్ అనువాదంలో క‌నిపించ‌డం లేదు" అని ఎన్‌పీఆర్ స‌మీక్షలో వ్యాఖ్య‌లు చేశారు.. అమెజాన్‌లో మాత్రం ప్ర‌తికూల స‌మీక్ష‌లు కొన్ని వ‌చ్చాయి. ఇది ఫేక్ స‌మాచార‌మ‌ని ఒక‌రు వ్యాఖ్యానించారు. "వుహాన్‌లో జీవితం ఎలా ఉండేదో ఆమె ప్ర‌పంచానికి చూపించారు" అని మ‌రోక స‌మీక్ష‌కుడు చెప్పారు.
---------------------------------------------------------------

The diary of a prominent writer who brought to light daily life in Wuhan during the earliest days of the outbreak of the coronavirus is now being translated into English. 65-year-old Feng Feng, who began writing online diaries about his experiences and experiences in Wuhan since January. Back then, the coronavirus crisis was the only option for China. Her diary went viral. This has helped millions of people in China know what is happening in Wuhan, where the coronavirus was born. Wuhan was the first to impose a complete lockdown in the world for fear of coronavirus outbreaks. The ties between China and the mainland were almost severed.

As the lockdown proceeds, Feng's popularity also rises. The propagandists are proposing to translate the contents of her diary into other languages. However, China is a marker of recognition for her internationally. Her reporting has been criticized by many Chinese. Some have called her a traitor.

What's in the diary?
China imposed a lockdown in Wuhan in late January. Then Feng began to write about what was happening in the city .. Online diary of Chinese social media platform Weibo. She mentions everything in the diary, ranging from the stress of being forced into an isolation to the challenges of reconciliation. "She gave voice to fear, excitement and anger. She also caused millions of fellow citizens to lose hope," commented HarperCollins, a leading company. "She also mentions in her diary the abuse of power, social injustice, and other debates that have occurred in the course of blaming Coronavirus. She has become the focal point of some of the controversies." She recounted in detail what happened when she went to fetch her daughter from the airport. It became known in Sunday Times. "There were no cars or pedestrians on the roads. There was no fear in those days. I and my girl always wore masks," she explained.

How did international identity come about?
China completely controls the news in their country. There are no independent news agencies. In this case, everyone relied on feng feng for a trustworthy treat. Her name as a writer also boosted confidence in the public. The Independent News website quoted one Weibo user as saying, "This country needs writers like you to work with honesty. "Her diary, along with her name and reputation, quickly crossed over to China."

Why is China angry?
Cyber ​​nationalism is the dominant theme in Chinese social media. Thousands of Chinese citizens are criticized on social media for insulting, insulting or insulting China. Feng Feng is not the first of these critically acclaimed works. With the coronavirus spreading to the countries of the world. At the same time, there was a lot of criticism over Feng Feng in China. The Fed Feng Diary was then the focus of Western media. "The diary she wrote became an international edition. It was also sold on Amazon. It was criticized by Chinese people," says the Whats On Weibo website. "Many Chinese people regarded the translation of Feng's diary as criticizing the way in which the virus was spreading in Wuhan as a weapon of the Chinese counterpart." She is more described as a traitor to China than a reporter who blinds her to the facts. Some have said that she is reaping the popularity. One Weibo user commented, "She is looking for a spiritual environment. HarperCollins, a US-based company, has been in the throes of US-China diplomatic rhetoric. On the other hand, the stance of Feng Feng has made it clear that the Chinese elite has broken the pot.

In the Global Times, a story has emerged that "many people in China see threats from foreign media outlets as a threat to them. "In her diary, Wuhan only referred to the dark aspect of the Wuhan. She criticized the efforts of the locals for the coronavirus and the oppression of people from all over the country."

How is she responding to her diary?
It is difficult to tell the public's reaction to the book, which went on sale last Friday. But the New York Times praised her honesty. "At the lockdown, she may have had a bad life. But she was very brave." The NPR summit commented that "the 76-day Wuhan lockdown contains crucial, detailed, and scary content. One commented that this was a fake talk. "She showed the world what life was like in Wuhan," said the Moroccan observer.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !