కార్మికుల నోట్లో మట్టి కొట్టేలా కేంద్రం ఉత్తర్వులు
కరోనా గత్తర కట్టడి చర్యల్లో భాగంగా దేశంలో లాక్‌డౌన్ అమల్లో ఉన్న సమయంలో వివిధ కంపెనీలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు పనిచేయకున్నా సరే, ఉద్యోగులకు, సిబ్బందికి పూర్తి వేతనాలివ్వాలంటూ మార్చి 29నాడు తాను ఇచ్చిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. నాలుగో విడత లాక్‌డౌన్ మార్గదర్శకాలలో హోం శాఖ ఈ విషయం స్పష్టం చేసింది. ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద ఇటీవల జారీ చేసిన ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ మార్చి 29 ఉత్తర్వును సవాలు చేస్తూ పలు వ్యాపార సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. చేసిన పనికి పూర్తి జీతాలు చెల్లించాలన్న ప్రభుత్వ,ప్రైవేటు సంస్థలు అన్నింటికీ ఒకే సూచననివ్వడం ఏకపక్షంగానూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు) ను ఉల్లంఘన అని తమ పిటిషన్లలో పేర్కొన్నారు.
హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా లాక్డౌన్ సమయంలో తమ కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించని ప్రైవేట్ సంస్థలపై ఎటువంటి బలవంతపు చర్యలను ఆశ్రయించవద్దని సుప్రీం కోర్టు మార్చి 15న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం, "హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పూర్తి వేతనాలు చెల్లించడం చిన్న మరియు ప్రైవేట్ సంస్థలకు ఆచరణీయంగా ఉండకపోవచ్చు, అవి లాక్డౌన్ కారణంగా దివాలా అంచున ఉన్నాయి. మార్చి 29 న ఉత్తర్వులో అనేక అంశాలు, వివిధ సమస్యలు ఉన్నాయి , వీటిని ప్రభుత్వం జాగ్రత్తగా పున: పరిశీలించాల్సిన అవసరం ఉంది" అని కోర్టు వ్యాఖ్యానించింది
వేతన చెల్లింపుపై హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలను పాటించని సంస్థలపై ప్రభుత్వం ఎటువంటి ఒత్తిడి చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు నిషేధించడంతో, ఆ ఉత్తరువును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ చర్యకు సంబంధించిఎలాంటి వివరణ ఇవ్వలేదు.
మే17న జారీ చేసిన ఉత్తర్వులో ʹమే 18న జారీచేసిన ఉత్తర్వుతో జతచేయబడిన మార్గదర్శకాలలో, విపత్తు నిర్వహణ చట్టం 2005 లోని సెక్షన్ 10 (2) (I) కింద హోం కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలోని జాతీయ కార్యనిర్వాహక కమిటీ జారీ చేసిన అన్ని ఉత్తర్వులు 2020 మే 18వ తారీఖు నుండి అమలులో ఉండవుʹఅని పేర్కొంది. ఈ ఆర్డర్‌లో ఇంతకుముందు జారీ చేసిన వివిధ సూచనల జాబితా వున్నది కానీ మార్చి 29 ఉత్తర్వు మాత్రం లేదు.
మార్చి 29 నాటి ఉత్తర్వులో ʹయజమానులందరూ, దుకాణాలు లేదా ఏ వాణిజ్య సంస్థలు అయినా, లాక్డౌన్ సమయంలో పనిచేయనప్పటికీ కూడా తమ కార్మికుల వేతనాలను, వారి పనిస్థలంలో, నిర్ణీత తేదీన, ఎటువంటి తగ్గింపు లేకుండా చెల్లించాలి" అని వున్నది. ఈ ఉత్తర్వు వేతన కోత లేదా ఉపసంహరణపై కార్మిక మంత్రిత్వ శాఖ సలహాకు సమానంగా ఉంది. అంటే హోం మంత్రిత్వ శాఖ యొక్క ఉత్తర్వు ఒక చట్టం ద్వారా మద్దతు పొందింది కాబట్టి ఇప్పుడు ఆ ఉత్తర్వును ఉపసంహరించుకోవడాన్ని తప్పనిసరిగా చట్ట ఉల్లంఘనచేసిన శిక్షాత్మకచర్యగా పరిగణించాల్సి వుంటుంది.
ఈ ఉత్తర్వు వేతన మినహాయింపు లేదా ఉపసంహరణపై కార్మిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన సలహాకు అనుగుణంగానూ, ఒక చట్టం మద్దతునూ కలిగి వుంది కాబట్టి హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వు తప్పనిసరిగా అమలు చేయాల్సి వుంటుంది. ఇలా ఉత్తరువును వెనక్కు తీసుకోవడం అనేది చట్ట ఉల్లంఘనగానూ, శిక్షార్హమైన చర్యగా పరిగణించాల్సి వుంటుంది.
-----------------------------------------------------------------
The central government has withdrawn its mandate on March 29 that employees and staff should be paid full salary despite various companies, subsidiaries and commercial firms operating in the country during lockdown. The Home Department made this point in the fourth installment lockdown guidelines. He said the recently issued directives under the Disaster Management Act have been discontinued.
A number of businesses have resorted to the Supreme Court challenging the government's March 29 order. In their petitions, all public and private institutions that are paid the full salary for the work done are unilaterally and in violation of Article 14 of the Constitution.
The Supreme Court on March 15 appealed to the government not to resort to any coercive action against private companies that do not pay full wages to their workers during the lockdown in accordance with the directives of the Home Ministry. A three-judge panel ruled that "paying full salaries at the behest of the Home Ministry may not be feasible for small and private companies, which are on the verge of bankruptcy due to a lockdown.
The Supreme Court has banned the government from taking any pressure on companies that do not comply with the directives of the Home Ministry on the payment of wages. However, no explanation has been given regarding the move.
In the Guidelines attached to the Decree dated May 17, the National Executive Committee headed by Home Secretary Ajay Bhalla under Section 10 (2) (I) of the Disaster Management Act 2005 states that all orders are effective from May 18, 2020. The order contains a list of various instructions issued earlier but no March 29 order.
The March 29 decree states that all employers, shops or any commercial enterprises must pay their workers' wages at their workplace, at their due date, without any deduction. ”This order is similar to the Labor Ministry's advice on wage cuts or withdrawals. The Ministry's order was backed by a law Now consider that the order continues to be siksatmakacaryaga ullanghanacesina upasanharincukovadanni the law.
This order is in accordance with the advice of the Ministry of Labor on the wage exemption or withdrawal and must be enforced by the Ministry of Home Affairs. Repealing this order would be considered a violation of the law and punishable.
Comments
Post a Comment