మాస్క్ పెట్టుకోమన్నందుకు మర్డర్ !


మాస్క్‌ లేదన్న కారణంతో తన కూతురును షాప్‌లోకి రానివ్వనందుకు సెక్యూరిటీ గార్డును కాల్చి చంపిన ఆరోపణలపై ఓ మహిళను అమెరికాలోని మిచిగన్‌ స్టేట్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె భర్త కుమారుడిపై కూడా కేసులు నమోదు చేశారు. మిచిగన్‌లోని ఫ్లింట్ ప్రాంతంలో ఉన్న ఫ్యామిలీ డాలర్‌ అనే స్టోర్‌లో పనిచేస్తున్న 43ఏళ్ల సెక్యూరిటీ గార్డు కెల్విన్‌ మునెర్లిన్ తలలో బుల్లెట్ గాయంతో శుక్రవారంనాడు మరణించారు. అమెరికాలో కరోనావైరస్‌ తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో మిచిగన్‌ రాష్ట్రం ఒకటి . తన కూతురిని మాస్క్‌ లేనందుకు షాప్‌లోకి రానివ్వలేదని ఆగ్రహించిన 45ఏళ్ల షార్మెల్ టీగ్‌ అనే మహిళ సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపింది. మిచిగన్‌ స్టేట్‌లో స్టోర్లు, బిజినెస్‌ ఏరియాలలో ఫేస్‌ మాస్క్‌ ధరించడం చట్టపరంగా తప్పనిసరి. కాల్పులు జరిపిన మహిళ భర్త ల్యారీ టీగ్‌, కొడుకు రమోనియా బిషప్‌లపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. వారు కూడా సెక్యూరిటీ గార్డుపై దాడి చేశారన్న ఆరోపణలు చేశారు పోలీసులు. కాల్పులు జరిపిన షార్మెల్ టీగ్‌ అనే మహిళను అరెస్టు చేయగా, తండ్రి, కొడుకు అక్కడి నుంచి పరారయ్యారు. ఉద్దేశపూర్వక హత్య, ఆయుధాల వాడకం ఆరోపణల మీద ముగ్గురిపైనా కేసులు పెట్టారు పోలీసులు. మాస్క్‌లు ధరించకుండా గవర్నర్‌ ఆదేశాలను ఉల్లంఘించారని ల్యారీటీగ్‌పై కేసు నమోదు చేశారు. కరోనావైరస్‌ను సమర్ధవంతంగా అడ్డుకోవడానికి స్టోర్లలోకి వెళ్లేవారు తప్పనిసరిగా ఫేస్‌ మాస్క్‌ వాడాలన్న నిబంధనలు మిచిగన్‌ స్టేట్‌లో అమలులో ఉన్నాయి. అయితే ఈ కేసులో షార్మెల్‌, ల్యారీ టీగ్‌ల కుమార్తెపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు పోలీసులు.

మొదట కొంత వాగ్వాదం జరిగిందని, సెక్యూరిటీ గార్డ్‌ మునెర్లిన్‌తో షార్మెల్ తీవ్రస్థాయిలో గొడవ పడిందని, ఆ తర్వాత తన కారులో వెళ్లిపోయిందని జినెస్సీ కౌంటీ ప్రాసిక్యూటర్‌ డేవిడ్‌ లీటన్ వెల్లడించారు. కాసేపటికి ఆమె తన కొడుకును, భర్తను వెంటబెట్టుకుని స్టోర్‌ దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత గార్డుపై దాడి చేసిందని అధికారులు వెల్లడించారు. ఆమె కొడుకే ట్రిగ్గర్‌ నొక్కాడని చెబుతున్నారు. ''సెక్యూరిటీ గార్డ్‌ కెల్విన్‌ మునెర్లిన్‌ హత్య ఒక అర్ధంలేని, విషాదఘటన. ఈ కేసులో నిందితులైన వారిపై విచారణ జరిపి చట్టపరమైన శిక్షలు అమలు చేస్తాం'' అని ప్రాసిక్యూటర్‌ వెల్లడించారు.

''నా కొడుకు తన విధులు నిర్వర్తించాడు. వాడు చేసిన తప్పేముంది'' అని మునెర్లిన్‌ తల్లి బెర్నాడెట్‌ అసోసియేటెడ్‌ ప్రెస్‌ న్యూస్‌ ఏజెన్సీతో అన్నారు. మునెర్లిన్‌ అంత్యక్రియల కోసం నిధుల సేకరించడానికి గో ఫండ్‌ మీ అనే పేజ్‌ను సిద్ధం చేశారు. దీని ద్వారా 100,000 డాలర్లు (80,000 యూరోలో) సేకరించారు. ఈ వెబ్‌పేజ్ ప్రకారం మునెర్లిన్‌ మరణంతో ఎనిమిదిమంది పిల్లలు అనాథలయ్యారు. కోవిడ్‌-19ను అడ్డుకోడానికి బిజినెస్‌ ఏరియాలో, స్టోర్స్‌లో ప్రవేశించేవారు తప్పకుండా మాస్క్‌ ధరించాలని మిచిగన్‌ గవర్నర్‌ గ్రెచెన్‌ విట్మర్‌ ఆదేశాలు జారీ చేశారు. మాస్క్‌ లేకుండా వచ్చేవారికి సేవలు నిరాకరించవచ్చని తన ఆదేశాలలో గవర్నర్‌ పేర్కొన్నారు. సోమవారంనాటికి మిచిగన్‌ రాష్ట్రంలో 43,950కేసులు నమోదయ్యాయి. అందులో 4,135మంది మరణించారని అధికార వర్గాలు వెల్లడించాయి. గతవారం పెద్ద ఎత్తున స్థానికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అందులో కొందరు ఆయుధాలు ధరించి ఉన్నారు. గవర్నర్‌ తన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని స్టేట్‌ హౌస్‌ దగ్గర గుమిగూడిన ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. కరోనావైరస్‌ సంబంధిత నిబంధనలపై అమెరికాలోని పలు ప్రాంతాలలో ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం నుంచి బిజినెస్‌ ఏరియాలో మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ ఓక్లహమాలో అమల్లోకి తెచ్చిన నిబంధనలను, కస్టమర్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో అధికారులు రద్దు చేశారు.

ఈ విషయంలో కొంతమంది తమను తుపాకులతో బెదిరించారని స్టిల్‌వాటర్‌ ప్రాంతంలో స్టోర్లలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు వెల్లడించారు. అయితే ఈ నిబంధనలను పాటించేలా కస్టమర్లను ఒప్పించాలని , కఠినంగా అమలు చేయాల్సిన అవసరం లేదంటూ, నిబంధనలను సవరిస్తూ ఓక్లహామా మేయర్‌ విల్‌ జాయిస్‌ నిర్ణయం తీసుకున్నారు.

--------------------------------------------------------

A US woman has been arrested by Michigan State Police for allegedly shooting a security guard for not letting her daughter into the shop for lacking a mask. She has also filed cases against her husband's son. Kelvin Mెర్nerlin, a 43-year-old security guard working at Family Dollar, a store in Flint, Michigan, died of bullet wounds Friday. The state of Michigan is one of the worst areas of coronavirus in America. A 45-year-old woman named Sharmel Teague opened fire on a security guard after she was furious that her daughter was not allowed into the shop for lacking a mask. Wearing a face mask is mandatory in stores and business areas in Michigan. Police have also registered cases against the woman's husband Laurie Teague and her son Ramonia Bishop. They were also accused of assaulting a security guard, police said. A woman named Sharmel Teague was arrested after her father and son fled the scene. Police have filed cases against all three on charges of intentional murder and weapons use. A lawsuit has been filed against Lauritieg for violating the governor's orders by not wearing masks. There are regulations in the state of Michigan that require people to use face masks in order to effectively prevent coronavirus. However, no allegations have been made against the daughter of Sharmel and Laurie Teague.

Genesee County Prosecutor David Leaton said that at first there was some altercation, Sharmel had a serious confrontation with security guard Mెర్nerlin and then went to his car. Shortly thereafter, she chased her son and her husband to the store. Officers later revealed that the guard was attacked. She is said to have pressed the trigger. “The murder of security guard Kelvin Mెర్nerlin is a nonsense and tragedy. "We will prosecute the accused in this case and prosecute them," the prosecutor said.

''My son has performed his duties. That's what they've done, '' Munerlin's mother, Bernadette, told the Associated Press news agency. The Go Fund Me page has been set up to raise funds for Munerlin's funeral. It raised over $ 100,000 (in 80 80,000). According to this webpage, eight children were orphaned by M ముnerlin's death. Michigan Governor Gretchen Witmer has ordered that anyone entering the business area and stores must wear a mask to block the Kovid-19. The governor said in his directives that those without masks would be denied services. As of Monday, the state of Michigan had 43,950 cases. According to official sources, 4,135 people died. A large number of locals staged a protest last week. Some of them are armed. The protesters gathered at the State House demanding that the governor withdraw his orders. Concerns and protests have been expressed in many parts of the US over coronavirus related conditions. Officials in Oklahoma, which mandated a mask in the business area since Friday, canceled the rules after customers were bitterly opposed.

Some employees working in stores in the Stillwater area have reported that some have threatened them with guns. But Oklahoma Mayor Will Joyce made the decision to revise the regulations, not to convince customers to comply with these regulations.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !