నచ్చినప్పుడు డబ్బులు డ్రా చేసుకుంటానంటే కుదరదు!
దేశవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతోంది. వివిధ వర్గాలు ఈ మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. కరోనా వైరస్ నుంచి పేదల్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేసి ఏప్రిల్ నెల ప్రారంభం నుంచి మూడు నెలలు పాటు ప్రతీ నెల రూ.500 బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సైతం ప్రతి నెలా 1500 రూపాయలు అందిస్తోంది. అయితే ఇలా డబ్బులు డిపాజిట్ చేసిన వారు ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవడానికి వీలులేదు. ఔను. కేంద్ర బ్యాంకింగ్ వ్యవహారాల శాఖ కార్యదర్శి దేబాశిష్ పాండా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
బ్యాంకుల వద్ద రద్దీని తగ్గిస్తూ నగదు తీసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర బ్యాంకింగ్ వ్యవహారాల శాఖ కార్యదర్శి దేబాశిష్ పాండా వెల్లడించారు. దీని ప్రకారం – మే 4వ తేదీ నుంచి మే 11వరకూ నూతన విధానం అమల్లో ఉంటుంది. మే 4వ తేదీన బ్యాంకు అకౌంట్ నంబర్లలో చివరి సంఖ్య 0 &1 ఉన్న వాబ్యాంకుకు వచ్చి తన ఖాతాలోని నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. మే 5న చివరి సంఖ్య 2 మరియు 3 ఉన్నవారు – మే 6వ తేదీన బ్యాంకు ఖాతాలో 4 మరియు 5 సంఖ్యలు ఉన్నవారు * మే 8వ తేదీన 6&7 సంఖ్యలు ఉన్నవారు – మే 11వ తేదీన బ్యాంకు అకౌంట్ నంబరు చివరన 8&9 సంఖ్యలు ఉన్నవారు బ్యాంకుల వద్దకు రావాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆదేశాలు అనుసరించి బ్యాంకులు తమ ఖాతాదారులకు తెలియజేశాయి. దీంతో పాటుగా సోషల్ డిస్టెన్స్ పాటించేలా మార్గదర్శకాల్ని జారీ చేశాయి.
ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన పథకం విషయంలో మరిన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ఖాతా కింద కుటుంబంలో ఒక మహిళకు ఒక్క అకౌంట్ ఉంటే మే 4న – ఇద్దరు లేదా ముగ్గురు మహిళలకు అకౌంట్లు ఉంటే మే 5న – 4లేదా 5అకౌంట్లు ఉంటే మే 6న 6లేదా 7 అకౌంట్లు ఉంటే మే 8న – 8లేదా 9 అకౌంట్లు ఉంటే మే 11న బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చని కోరారు. బ్యాంకుల వద్ద రద్దీని తగ్గిస్తూ రూపే – బ్యాంక్ మిత్రాస్ – కస్టమర్ సర్వీస్ పాయింట్స్ – ఏటీఎంలలో డబ్బుల్ని డ్రా చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇతర బ్యాంక్ ఎటిఎంల నుండి డబ్బును ఉపసంహరించుకోవటానికి ఎటువంటి ఛార్జీలు ఉండవని బ్యాంకింగ్ వ్యవహారాల శాఖ కార్యదర్శి దేబాశిష్ పాండా అన్నారు.
-------------------------------------------------------------
Corona disturbance continues throughout the country. Various groups have been deeply affected by the pandemic. At the same time, the central and state governments are providing financial assistance through various schemes. The central government has set up a special package to protect the poor from the corona virus and has been depositing Rs 500 in bank accounts every month for three months from the beginning of April. Telangana government is also offering Rs 1500 per month. But when the money is deposited, they are not allowed to take it. Yes. Debashish Panda, Secretary, Central Banking Affairs, made the same point.
Debashish Panda, secretary, central banking affairs, said that the bank has made arrangements to reduce cash flow at banks. Accordingly - the new policy will be in effect from May 4th to May 11th. On May 4, Wabank, who has the last number 0 & 1 in the bank account numbers, can draw cash in his account. Those who have the last number 2 and 3 on May 5 - those who have the numbers 4 and 5 in the bank account on May 6 * Those who have numbers 6 & 7 on May 8 - those who have the numbers 8 & 9 at the end of the bank account number on May 11. The banks have informed their clients following the central directives. In addition they issued guidelines for the adoption of Social Distance.
Pradhan Mantri Jan Dhan has issued further guidelines on the Yojana scheme. If one woman has one account per family under this account May 4 - If two or three women have accounts May 5 - 4 or 5 accounts May 6 or 7 Accounts May 8 - 8 or 9 Accounts May 11 DUBLIN drawn from bank accounts. Rupay - Bank Mitras and Customer Service Points - has been asked to draw a double in ATMs to ease congestion at banks. Debashish Panda, secretary, banking affairs, said there was no charge for withdrawing money from other bank ATMs as per government orders.

Comments
Post a Comment