అన్నీ తానైన అక్క !


లాక్ర్‌ డౌన్ వల్ల సామాన్య ప్రజల కష్టాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇందుకు ఇండోర్లో సోమవారం జరిగిన హృదయవిదారక సంఘటనే ఉదాహరణ! ఇండోర్లోనే ఎంబీఏ చదువుతున్న శివం వర్మ లాక్ డౌన్ కష్టాలు తీవ్రమవడంతో అతడు ఇండోర్ నుంచి స్వగ్రామానికి తన స్నేహితుడితో కలిసి మోటారు సైకిల్‌ పై బయలుదేరాడు. కానీ విదిషా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శివం మరణించాడు. మృతుడి తండ్రి చాలా ఏళ్ల కిందటే మరణించగా, అతనికి సోదరి ప్రియాంక మాత్రమే ఉంది. ఏకైక సోదరుడు శివం మృత్యువాత  పడటంతో ఆ సోదరిపై పిడుగు పడ్డట్లయింది! లాక్ డౌన్ కారణంగా బంధువులు ఎవరూ ఆమె అంత్యక్రియలకు చేరుకోలేదు. శివమ్ మృతదేహాన్ని పోలీసులు ప్రియాంకకు అప్పగించిన తర్వాత సాట్నాలోని నారాయణ చెరువు ముక్తిధాంలో ఆమె కొంతమంది స్థానికులతో కలిసి అంత్యక్రియలు పూర్తి చేసింది. తమ్ముడి చితికి నిప్పు పెట్టిన ప్రియాంకను ఓదార్చడం అక్కడున్న ఎవరి వల్ల కాలేదు.
---------------------------------------------------------------------------------
The downfall of the Locker is that the suffering of the common people is increasing day by day. Here's an example of a heartbreaking Monday in Indore! Shivam Verma, who is studying for an MBA in Indore, went on a motorcycle with his friend to his hometown of Indore. But Shivam died in a road accident near Vidisha. The deceased's father died many years ago and he has only one sister, Priyanka. The only brother Shivam has died and the sister is thrown! None of the relatives reached her funeral due to the lockdown. After the police handed over Shivam's body to Priyanka, she completed a funeral with some locals at the Narayana Pond Muktidham in Satna. Priyanka who set fire to her younger brother's death could not be comforted by anyone there.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !