మందు దొరక్క నటి మనోరమ కొడుకు ఆత్మహత్యాయత్నం!
లాక్‌డౌన్ కారణంగా మద్యం షాపులు కూడా మూత పడ్డ సంగతి తెలిసిందే. అయితే కొందరు మందు బాబులు మద్యం దొరక్కపోయే సరికి విచిత్రంగా ప్రవర్తించడమే కాక, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ సీనియర్ నటి మనోరమ కుమారుడు మద్యం దొరకడం లేదనే బాధతో అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగారని వార్తలు వస్తున్నాయి. అపస్మారక స్థితికి చేరుకున్న బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.
తమిళంతో పాటు పలు తెలుగు సినిమాలలో నటించిన మనోరమ తనయుడు భూపతి స్థానిక టీనగర్‌లోని నీలకంఠం మెహతా వీధిలో కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. మద్యం దొరక్కపోవడంతో మత్తు కోసం నిద్ర మాత్రలు వేసుకున్నారు. మోతాదు ఎక్కువ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. ఆయన ఆత్మహత్యాయత్నం చేయలేదని భూపతి తనయుడు రాజరాజన్ చెప్పుకొచ్చారు. దయ చేసి లేనిపోని వదంతులు పుట్టించవద్దని కోరారు.
---------------------------------------------------------------------------------
Liquor shops have been reported to have closed as a lockdown factor. However, some drug addicts are not only acting strangely but also committing suicide. The latest news is that the son of prominent senior actress Manorama is suffering from a lack of alcohol. It is customary for the victim to be taken to hospital and treated for the unconscious.
Bhupathi, who played Tamil and Tamil films, is living with his family in Neelakantham Mehta Street in Teenagar. Due to lack of alcohol, he took sleeping pills. As the dose increased, she went into unconscious state. Bhupathi's father Rajarajan said he did not attempt suicide. Rumors that he has not been asked not to give up.
Comments
Post a Comment