బస్తీల్లో భయం భయం !


హైదరాబాద్‌ జిల్లాలో కరోనా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ఒకరి తర్వాత మరొకరికి వైరస్‌ విస్తరిస్తోంది. శనివారం రాత్రి వరకు జిల్లాలో 111 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, తాజాగా ఆదివారం మరో 51 కేసులు వెలుగు చూశాయి. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 162 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 11 మంది డిశ్చార్జ్‌ కాగా, ఖైరతాబాద్, యూసఫ్‌గూడ, చంచల్‌గూడ, సికింద్రాబాద్, దారుషిఫా, న్యూమలక్‌పేట్‌లకు చెందిన ఆరుగురు మృతి చెందారు. 90 శాతం కేసులు మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారితో పాటు వారి కుటుంబ సభ్యుల్లోనే వెలుగు చూడటం గమనార్హం. ముఖ్యంగా సికింద్రాబాద్, ఎంజే రోడ్, మహేంద్రహిల్స్, సికింద్రబాద్, ఎంజే రోడ్, నాంపల్లి, యూసఫ్‌గూడ, ఎమ్మెల్యే కాలనీ, న్యూమలక్‌పేట, చంచల్‌గూడ, నారాయణ గూడ, ఖైరతాబాద్, దారుషిఫా తదితర బస్తీల్లోని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పక్కింట్లో ఎవరికి ఏ వైరస్‌ సోకిందో..? ఎవరి నుంచి ఎప్పడు? ఏ రూపంలో వైరస్‌ విరుచుకుపడనుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 
ఐదు రోజులు.. 122 కేసులు
గ్రేటర్‌లోని మూడు జిల్లాల్లో ఇప్పటి వరకు 193 కేసులు నమోదు కాగా, ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఆదివారం వరకు..కేవలం ఐదు రోజుల్లోనే 122 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక రంగారెడ్డిలో ఇప్పటి వరకు 17 కేసులు నమోదు కాగా..వీటిలో ఎక్కువగా మణికొండ, రా జేంద్రనగర్, షాద్‌నగర్‌ పరిధిల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ జిల్లాలో 14 కేసులు నమోదవగా, వీటిలో ఎక్కువ కేసులు కుత్బుల్లాపూర్‌లోనే నమోదవడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు కుత్బుల్లాపూర్, షాద్‌నగర్‌లకు చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో 450 మందికి సంబంధించిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. మరో 3300 మందికిపైగా గాంధీ, ఫీవర్, సరోజినిదేవి, నేచర్‌క్యూర్, యునానీ, రాజేంద్ర నగర్‌లోని ఐసోలేషన్‌ కేంద్రాలు సహా ఇతర జిల్లాల్లో ఉన్న ఐసోలేషన్‌ కేంద్రాల్లో పరీక్షల కోసం నిరీక్షిస్తున్నట్లు తెలిసింది.
--------------------------------------------------------------------------------
Corona in the Hyderabad District The virus is spreading one after another. As of Saturday night, 111 positive cases were reported in the district, while 51 more were reported on Sunday. As many as 162 positive cases have been reported in the district so far. Of these, 11 were discharged while six from Khairatabad, Yousafguda, Chanchalguda, Secunderabad, Darushifa and Numalakpet were killed. It is noteworthy that 90 per cent of cases were reported to the family of those who went to Markaz and their families. People in Bastille are especially frightened by Secunderabad, NJ Road, Mahendra Hills, Secunderabad, MJ Road, Nampally, Yousafguda, MLA Colony, Numalakpet, Chanchalguda, Narayana Guda, Khairatabad and Darushifa. What virus is infected in Pakkint ..? From whom The problem is that the virus is going to break down.

Five days .. 122 cases

In the three districts of Greater, 193 cases have been reported so far from April 1 to Sunday. Rangareddy has seen 17 cases so far. Medchal district has 14 cases, most of which are in Kutbulapur. Meanwhile, two people from Kutbullapur and Shadnagar have died. Diagnostic tests for another 450 people are yet to be revealed. More than 3300 people have been waiting for exams at Gandhi, Fever, Sarojinadevi, Isolation centers in Naturecare, Unani and Isolation centers in Rajendra Nagar.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !