గ్యాంగ్ స్టర్ ను కాల్చి చంపిన మావోయిస్టులు


కిడ్నాపులు, హత్యలు, దోపిడీలతో ప్రజలను భ్యబ్రాంతులకు గురి చేస్తున్న్ అగ్యాంగ్ స్టర్ ను మావోయిస్టులు కాల్చి చంపారు. బీహార్ లోని సహర్సా, మధుబని, దర్భాంగా, సమస్తిపూర్, ఖగారియా జిల్లాల్లో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పేరు మోసిన గ్యాంగ్ స్టర్ రామానంద్ యాదవ్ ఈ నెల 8వ తేదీ సోదరుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఖగారియాకు వెళ్ళాడు. అంత్యక్రియల నుండి తిరిగి వచ్చేటప్పుడు మావోయిస్టులు అతన్ని చుట్టు ముట్టారు. 

ఈ సందర్భంగా గ్యాంగ్ అనుచరులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. మావోయిస్టులు చాకచక్యంగా వ్యవహరించి గ్యాంగ్ స్టర్ రామానంద్ యాదవ్ ను ఖతం చేశారు. ఈ కాల్పుల్లో రామానంద్ తో పాటు అతని మేనల్లుడు, ముఖ్య అనుచరుడు చనిపోయారు. నెల రోజుల క్రితం ఖగారియాకు సమీపంలో ఉన్న అదే డయారా (రివర్‌లైన్ బెల్ట్) ప్రాంతంలో రామానంద్ పోలీసుల చేతికి చిక్కి వారిని ఏమార్చి పారిపోయాడు.
----------------------------------------------------------------------------

Maoists have shot and killed a gangster, threatening people with kidnappings, murder and robbery. Gangster Ramanand Yadav, who is known for making eye contact with people in Bihar's Saharsa, Madhubani, Darbhanga, Samastipur and Khagaria districts, went to Khagaria to attend his brother's funeral on the 8th of this month. On his return from the funeral, Maoists surrounded him. 

Gang followers and Maoists opened fire on the occasion. The Maoists have ruthlessly murdered gangster Ramanand Yadav. Ramanand along with his nephew and chief aide were killed in the shooting. Ramanand caught the police at the same Diyara (Riverline Belt) area near Khagaria a few months ago and fled the scene.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !